ఎమ్మెల్యే రోహిత్ మీరు డబ్బుల కోసమే అధికారంలోకి వచ్చారా..?
ప్రజలు ప్రాణాలు కోల్పోతున్న పట్టించుకోరా..?
నిలిచిపోయిన పనుల ప్రారంభానికి మోక్షమెప్పుడు..?
తెలంగాణ రాష్ట్రంలో జీఎస్‌టీ లాగా ఏఆర్ఆర్,మెదక్‌లో ఎఆర్ఆర్ ట్యాక్స్‌లు చెల్లిస్తేనే పనులకు మోక్షమా..?
రెండో రోజుకు చేరిన రిలే నిరహార దీక్షలు.
బీజేపీ పార్టీ తరఫున పూర్తి మద్దతునిచ్చి దీక్షలో పాల్గొన్న పంజ విజయ్ కుమార్.
భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కార్యాలయం .
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి జనవరి 12:
మెదక్ నియోజక వర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మీరు డబ్బుల కోసమే అధికారంలోకి వచ్చారా..? రోడ్డు పనులు మధ్యలో నిలిచిపోయి ప్రజలు ప్రాణాలు కోల్పోయి, వారి కుటుంబాలు రోడ్డు పడుతుంటే చోద్యం చూస్తున్నారా అని నిజాంపేట్ మాజీ జెడ్పీటీసీ, మెదక్ బీజేపీ అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జ్ పంజ విజయ్ కుమార్ స్థానిక ఎమ్మెల్యేపై నిప్పులు చెరిగారు. నిజాంపేట్ మండల కేంద్రంలో మధ్యలో నిలిచిపోయిన రోడ్డు పనులను ప్రారంభించాలని పలు గ్రామాల ప్రజలు రిలే నిరహార దీక్షలు చేపట్టారు. కాగా ఆదివారం రిలే నిరహార దీక్షలు రెండో రోజుకు చేరుకొగా, పంజ విజయ్ కుమార్ దీక్షలో పాల్గొని భారతీయ జనతా పార్టీ తరఫున సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిజాంపేట్ మండల కేంద్రానికి వచ్చే గ్రామాలైన నస్కల్,రాంపూర్,నందగోకూల్, నగరంతండా గ్రామాల రోడ్డు పనులు మధ్యలో నిలిపివేయడం దురదృష్టకరమన్నారు. గత ప్రభుత్వం హాయంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో భారీ ఎత్తున పాదయాత్ర చేయడంతో రూ. 24 కోట్లను రోడ్డు మరమ్మతుల కోసం కేటాయించిన విషయం ఆయన గుర్తు చేశారు. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎన్నో రకాల పన్నులు విధించి ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉచిత బస్సు సౌకర్యం కల్పించి ఆటో డ్రైవర్ల కుటుంబాలను రోడ్డు పడేసిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికే దక్కిందన్నారు. రోడ్డు సౌకర్యం సరిగ్గా లేక అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ విషయం బీజేపీ ఆధ్వర్యంలో కలెక్టర్, అర్ అండ్ బి ఈఈ గార్ల దృష్టికి సైతం తీసుకెళ్తే బిల్లులు కడితేనే పనులు ప్రారంభమవుతాయని చెప్పడం దారుణమన్నారు. కాగా ఈ విషయాన్ని మెదక్ ఎంపీ రఘునందర్ రావు దృష్టికి తీసుకెళ్లగా.. ఆయన అధికారులతో మాట్లాడితే తూతూమంత్రంగా ఒకరోజు మాత్రమే తాత్కలికంగా పనులు చేశారన్నారు. తెలంగాణ రాష్ట్రంలో జీఎస్‌టీ లాగా ఏఆర్ఆర్, మెదక్‌లో ఎఆర్ఆర్ ట్యాక్స్‌లు కడితేనే పనులకు మోక్షం లభిస్తుందా అని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్న ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నేరవేర్చడంతో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఖబద్దార్ ఎమ్మెల్యే
మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ ఎన్నికల్లో సమయంలో మీరు ప్రజలకు ఇచ్చిన హామీలను నేరవేర్చకుంటే బీజేపీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. మధ్యలో నిలిచిపోయిన పనులను వెంటనే ప్రారంభించాలని లేకుంటే ఖబద్దార్ ఎమ్మెల్యే ప్రజలు మిమ్మల్లి నియోజకవర్గంలో తిరగకుండా చేస్తారన్నారు. ఏసీ రూముల్లో నుంచి ఎమ్మెల్యే ప్రజల్లోకి వస్తేనే ప్రజా పాలన సాధ్యమన్నారు. కాగా ప్రభుత్వానికి ఎటువంటి ఆదాయం రాని చర్చికి కోట్లాది రూపాయలు నిధులు మంజురు చేసి, ప్రభుత్వానికి ఆదాయ వనరులు ఇచ్చే ఏడుపాయలను విస్మరించడంతో బీజేపీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తేనే సీఎం రేవంత్ రెడ్డి ఏడుపాయల పర్యటనలో రూ. 32 కోట్ల నిధులను కేటాయించారని, ఆ నిధులు సైతం పంచాయితీ రాజ్ శాఖ ద్వారానే కేటాయించారని, ఎండోమెంట్ ద్వారా కేటాయించలేదన్నారు. ఎమ్మెల్యేకు ఏమాత్రం చిత్తశుద్ది ఉన్న నియోజకవర్గ సమస్యలను పరిష్కారించడంతో పాటు ఏడుపాయల్లో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రానున్న శివరాత్రికి ఏడుపాయలకు భక్తులు భారీగా వస్తారని, భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. గతంలో మైనంపల్లి హన్మంతరావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే రామాయంపేట్ నియోజకవర్గం కోల్పోయిందని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారు నిద్రమత్తులో నుంచి మెల్కోని ప్రజల సమస్యలను పరిష్కారించాలని, లేనిపక్షంలో బీజేపీ తరఫున గ్రామాగ్రామానా.. ఇంటింటికి పాదయాత్రగా వెళ్లి ఎమ్మెల్యే వైఫల్యాలను వివరిస్తామన్నారు. ఈ దీక్షలో లింగం, సంజీవ్, దుర్గయ్య, మెట్టు లింగం, పాగాలా ఎల్లంయాదవ్, కమ్మరిపల్లి ఎల్లయ్య, నరేష్‌గౌడ్, వెంకట్ గౌడ్‌తో పాటు బీజేపీ నాయకులు శంకర్‌గౌడ్, వడ్ల శ్యాములు, బానుచందర్, ఎల్లగౌడ్, కార్తీక్, లక్ష్మన్ తదితరులున్నారు.