సమాచార హక్కు చట్టం రక్షణ సమితి క్యాలెండర్ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ.
తెలంగాణ కెరటం అచ్చంపేట (జనవరి 1):
భారతదేశంలో సమాచార హక్కు చట్టాన్ని రూపొందించడం ఒక మైలురాయి అని అచ్చంపేట నియోజకవర్గ శాసనసభ్యులు చిక్కుడు వంశీకృష్ణ అన్నారు. అచ్చంపేట పట్టణంలో బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సమాచార హక్కు చట్టం రక్షణ సమితినూతన సంవత్సర-2025 క్యాలెండర్ ను అచ్చంపేట నియోజకవర్గ శాసనసభ్యులు చిక్కుడు వంశీకృష్ణ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం-2005పారదర్శకతజవాబుదారీతనాన్ని ప్రోత్సహించడం అవినీతిని అరికట్టడం, పౌరులకు సాధికారత కల్పించడం లో దోహదపడుతుందని ఆయన అన్నారు.ప్రజాస్వామ్య పాలనను బలోపేతం చేయడం కోసం బలమైన చట్టపరమైన చర్యలు పౌరులు తమ హక్కులనువినియోగించుకోవడానికి అనువైన చట్టమే సమాచార హక్కు చట్టం-2005 అని ఎమ్మెల్యే అన్నారు.ప్రభుత్వఅధికారులను జవాబుదారీగా ఉంచడానికి ఇది శక్తివంతమైన సాధనం లా ఉంటుందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వారితోపాటు రాష్ట్ర అధ్యక్షులు కొర్ర కిషన్ నాయక్ ఉపాధ్యక్షులు లక్ష్మయ్య ప్రధాన కార్యదర్శి అజీమ్ కార్యదర్శి పగిడిమర్రి యాదగిరి కోశాధికారి ఆనంద్ కార్యవర్గ సభ్యులు ప్రకాష్ సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.