సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి
తెలంగాణ కెరటం, డిసెంబర్ 18, మందమర్రి
మంచిర్యాల జిల్లా లోని యాదవుల సమస్యలపై కొంత మంది యాదవ సంఘం నాయకుల తోని చెన్నూరు శాసన సభ్యులు డాక్టర్ . వివేక్ వెంకట స్వామి వారి ఆధ్వర్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు రేవంత్ రెడ్డి ని కలిసి ఎమ్మెల్యే ద్వారా యదవులకు సంబంధించిన విషయాలను గౌరవ దృష్టి కి తీసుకెళ్లారు.జిల్లాలో ఉన్న యదవుల సమస్య ల గురించి ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి కి అదే విధంగా ముఖ్యమంత్రి వర్యులకు మంచిర్యాల జిల్లా యదవుల సంఘం అధ్యక్షులు బండి సదానందం యాదవ్ వివరించారు.
వెంటనే సమస్యలు విన్న ముఖ్యమంత్రి తొందరలోనే సమస్యా ల పరిష్కరిస్తామని హామీ ఇచారు.ఈ కార్యక్రమంలో జిల్లా యాదవ సంఘ జనరల్ సెక్రెటరీ మల్లెతుల నరేష్ యాదవ్ ,రాష్ట్ర యూత్ ఉప అధ్యక్షులు బండి శివ కుమార్ యాదవ్ ,జిల్లా ఉప అధ్యక్షుడు ఎరవేని కిట్టన్న యాదవ్,దండేపల్లి మండల అధ్యక్షుడు అల్లంలా సతేన్న యాదవ్,ఉప అధ్యక్షుడు అల్లం ల మల్లేష్ యాదవ్, జిల్లా యూత్ నాయకులు మాచర్ల గోపి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.