మహమ్మద్ అలీ షబ్బీర్ జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలి
తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 14:
మాజీ మంత్రి,రాష్ట్ర ప్రభుత్వ ఎస్సి, ఎస్టి, బీసీ, మైనారిటీ ముఖ్య సలహాదారులు మహ్మద్ అలీ షబ్బీర్ జన్మదిన వేడుకలను విజయవంతం చేయాలని అభిమానులకు,కాంగ్రెస్ నాయకులకు, కార్యకర్తలకు కామారెడ్డి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మీనుకూరి బ్రహ్మానందరెడ్డి పిలుపునిచ్చారు. కామారెడ్డి పట్టణంలో బారి ఎత్తున రక్తదాన శిబిరాన్ని నిర్వహిస్తున్న సందర్భంగా అభిమానులు ,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు బారి సంఖ్యలో పాల్గొని రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేసిన వారికి హెల్మెట్, ధ్రువీకరణ పత్రం అందజేయనున్నామన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్ల పంపిణీ, అన్నదాన కార్యక్రమాలను నిర్వహించనున్నందున పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు.