మాయనీయురాలు సావిత్రిభాయి పూలే జయంతి
తెలంగాణ కెరటం యాదాద్రిభువనగిరి జిల్లా ప్రతినిధి జనవరి
సావిత్రి బాయ్ పూలే జయంతి సందర్భంగా బిజెపి జిల్లా కార్యాలయంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు దుర్గాపతి లక్ష్మీనారాయణ గౌడ్ అధ్యక్షతన నివాళి అర్పించే కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ సావిత్రిబాయి ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు అని,స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలితరం మహిళా ఉద్యమకారిణి.. స్త్రీల విముక్తి కోసం అహర్నిశలు శ్రమించిన నాయకి, గొప్ప రచయిత్రి. స్త్రీపురుషులు కులమతాలకతీతంగా విద్యనభ్యసించడం సహజమైన హక్కు ఉంటుందని, అందుకే అందరూ చదవాలి… అందరూ సమానంగా బ్రతకాలి… అని అనునిత్యం తపించిన సామాజిక విప్లవ మాతృమూర్తి సావిత్రిబాయి. నాటి, నేటి సమాజంలో సావిత్రిబాయి ప్రాముఖ్యత గొప్పది అని,1847 నాటికి భర్తతో కలిసి బాలికలకోసం పూనేలో మొదటి పాఠశాల ప్రారంభించారు,
ఒకరు తమ ఇంటి ఆవరణను బడి కోసం ఇస్తే, కొంత మంది పుస్తకాలు సేకరించారు. మోరోవిఠల్, వాల్వేకర్, దియోరావ్ వంటి ప్రముఖులు పాఠశాల నిర్వహణకు సహకరించారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ ఛైర్మన్ మాయ దశరథ,రాష్ట కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి,జిల్లా కార్యదర్శి వైజంతి,కాదూరి అచ్చయ్య,రత్నపురం బలరాం, పాదరాజు ఉమాశంకర్,ఉడుత భాస్కర్,కోళ్ల భిక్షపతి,పక్కీర్ రాజేందర్ రెడ్డి,మేడి కోటేష్,పంచెద్దుల బలరాం,కొల్లోజు సతీష్,పల్లెపాటి వేణు,ఒబీసీ పట్టణ అధ్యక్షులు కట్కమోజు ఉషాకిరణ్,సురేష్ రెడ్డి,మాటూరి అనిల్,పెంట్టబోయిన నాగరాజు,వంతు సన్నీ,ఆంజనేయులు,బుగ్గ దేవేందర్,నరేష్ నాయక్,కొలిచెలిమి మల్లికార్జున్, తదితరులు పాల్గొన్నారు.