---Advertisement---

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఎంపీ ధర్మపురి అరవింద్

---Advertisement---

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన ఎంపీ ధర్మపురి అరవింద్

నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు స్థలం కేటాయించాలని విజ్ఞప్తి

సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 22:.

ఇటీవల కేంద్ర కేబినెట్ జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు నవోదయ విద్యాలయాలు మంజూరు చేసిన విషయం తెలిసిందే. నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అర్వింద్ ఆదివారం జూబ్లీహిల్స్ లోని సీఎం నివాసంలో జగిత్యాల శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్ తో కలిసి ఈ రెండు జిల్లాల్లో నవోదయల ఏర్పాటుకు ఒక్కోచోట సుమారు 20 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం అందజేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. ఈ సందర్భంగా రెండు జిల్లాల్లో పలు ప్రతిపాదిత స్థలాలను ఎంపీ అరవింద్ సీఎంకు వివరించారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో కొనసాగుతున్న రైల్వే ప్రాజెక్టులను ఎంపీ అర్వింద్ వివరిస్తూ, మాధవ్ నగర్ ఆర్ఓబి 50-50 పద్ధతిలో మంజూరు చేయబడిందని, అడివి మామిడిపల్లి ఆర్ఓబి పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులతో మంజూరైనప్పటికీ, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులను మళ్ళించిందన్నారు. కాంట్రాక్టర్లు సకాలంలో బిల్లులు అందక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, దీనివల్ల పనుల్లో కొంత జాప్యం జరుగుతుందన్నారు. ఇవేగాకుండా ఇతర ఆర్వోబీల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని, కాంట్రాక్టర్లకు బిల్లులు మంజూరు చేసి , పనులను త్వరితగతిన పూర్తయ్యేలా చొరవ చూపాలని కోరారు. జిల్లాలో ప్రతిపాదిత జక్రాన్ పల్లి ఎయిర్పోర్ట్ పనులకు సంబంధించి ఓఎల్ఎస్ సర్వే ని రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేసి కేంద్రానికి నివేదించాలని కోరారు. మరోవైపు జగిత్యాల పట్టణంలో కేంద్రీయ విద్యాలయం సైతం మంజూరయ్యే దశలో ఉందని, దీనికి కూడా స్థల అన్వేషణ చేయాలని సీఎంని కోరారు. జగిత్యాల శాసనసభ్యులు డా.సంజయ్ కుమార్ ఎంపీ అర్వింద్ తో కలిసి జగిత్యాల పట్టణానికి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలపై ముఖ్యమంత్రితో చర్చించారు. తమ విజ్ఞప్తుల పట్ల సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని ఎంపీ అర్వింద్ పత్రికా ప్రకటన విడుదల చేస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment