ముదిరాజ్ లను బీసీ-డీ నుండి బీసీ -ఏ లో చేర్చాలి
దక్షిణ భారతదేశంలో ఉన్న కులాలలో అతి పెద్ద కులంగా పులువబడుతున్నది ముదిరాజ్ కులం అని చెప్పాలి, తమిళనాడు కేంద్రంగా కలబ్ర రాజులకు వారసులుగా, ద్రావిడ ప్రజలుగా పిలువబడుతున్న వాళ్ళు ముదిరాజ్ లు, అదేవిధంగా మధ్య యుగంలో విజయనగర రాజులకు సామంతులుగా సుదీర్ఘంగా పరిపాలన చేశారు, సుమారు మూడువందల ఏళ్ల పాటు పాలించిన ఘనత వీరికి ఉంది, అయితే దక్షిణ భారతదేశంలో ముస్లిం దండయాత్ర ను ఎదురించిన వారిలో వీరు కలరు, ‘ ముది ” అనగా మొదటి “రాజు” పరిపాలకుడుగా ముదిరాజ్ అంటే మొదటి పాలకుడిగా చెప్తారు, ఆ విధంగా వివిధ రకాలుగా పేర్లు ఉద్భవించాయి, అందులో “ముతురాజ” “ముదిరాజ్” “మూత్రసి ” ” బంటు” కోలి ” తెనుగు” తెనుగోళ్ళు ” ఇలా పిలవడం జరుగుతోంది, అయితే ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లో విస్తరించిన అతి పెద్ద కులం గా చెప్పవచ్చు,
ప్రధాన ముఖ్యవృత్తి:
ప్రధానంగా చూస్తే అటు ఆంధ్ర లో కానీ, తెలంగాణ లో కానీ, విరి ప్రధాన వృత్తి పూర్వకాలంలో రాజులుగా ఉన్న వీళ్ళు రాచరికం పోయి వివిధ రకాల వృత్తులు చేపట్టడం జరిగింది, అందులో చెప్పుకుంటే “కావాలి” గా అంటే గ్రామ రక్షకుడిగా పనిచేశారు, చెరువులను లీజు కు తీసుకోని చేపలు పట్టడం, తోటలు గుత్తకు తీసుకోని వివిధ ప్రాంతాల్లో తిరిగి పండ్లు అమ్మడం, కొన్ని ప్రాంతాల్లో అయినే “హంటింగ్” అంటే “వేట” కూడా విరి వృత్తిగా చేసుకొని జీవనం సాగిస్తున్నారు అని చెప్పొచ్చు, ప్రధానంగా జీవనం కోసం రాచరికం పోయి నేడు కూలీలుగా మారారు, నేటికీ చేపలుపట్టి బ్రతుకుతున్న వాళ్ళు చాలానే ఉన్నారు.
రాజకీయ వెనుకబాటు:
ముదిరాజ్ లు గతంలో రాజులుగా ఉన్న వీళ్ళు నేడు రాజకీయంగా చాలా వెనకబడి ఉన్న జాతిగా చెప్పవచ్చు, ముదిరాజ్ లు రాష్ట్రంలో సుమారు 12 శాతం పై ఉన్నారు అని చెప్పవచ్చు, వీళ్ళు అన్నీ నియోజకవర్గాల్లో పోటీ చేస్తే వీరికి జనాభా ప్రకారం కనీసం ముప్ఫై సీట్ల పై వీళ్లకు లభించే అవకాశం ఉంటుంది, కానీ నేడు ఉన్న పరిస్థితి చూస్తే గత ప్రభుత్వం హయాంలో కేవలం ఒక్కరూ మాత్రమే ఎమ్మెల్యే ఉండటం జరిగింది అది కూడా ఈటెల రాజేందర్ గారు, ముఖ్యంగా వీళ్ళల్లో వీళ్ళకే రాజకీయ చైతన్యం లేకపోవడం, అధికంగా ముదిరాజ్ సంఘాలు పెట్టుకోవడం, ఉన్న సంఘాల నాయకులు కూడా కొద్ది పార్టీలకు అనుకూలంగా వ్యవహరించడం జరుగుతుంది, అయితే కొద్దో గొప్పో ఆర్దికంగా ఉన్న వాళ్ళు పోటీ చేయకపోవడం, వాళ్ళకు సొంత కులం వాళ్ళే మద్దతు ఇవ్వకపోవడం, వీళ్లకు బలంగా ఆస్తులు లేకపోవడం, కనీసం రెండు ఎకరాల లేనివాళ్ళు కూడా చాలా కుటుంబాలు ముదిరాజ్ జాతిలో ఉన్నారు అని చెప్పవచ్చు, అదే విధంగా ముదిరాజ్ లు చూస్తే సామాజికంగా మరియు అటు ఆర్దికంగా బలంగా లేకపోవడం మరొక కారణం గా చెప్పాలి.
రిజర్వేషన్ పరంగా అన్యాయం:
వాస్తవానికి రిజర్వేషన్ పరంగా అత్యధికంగా అన్యాయం ముదిరాజ్ లకు జరుగుతోంది ఆని చెప్పాలి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009 లో అప్పటి వై ఎస్ రాజశేఖర రెడ్డి గారు అనంతరామన్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ద్వారా ముదిరాజ్ లను బిసి-డీ నుండి బిసి -ఏ లోకి మార్చుతూ జివో నెంబర్ 15 ఇచ్చారు, బిసి- ఏ లో సీరియల్ నెంబర్ 1 గా చేర్చారు, దానిని సవాల్ చేస్తూ బీసీ ఏ కులాలూ వాళ్ళు హైకోర్టు లో కేసు వేయడం జరిగింది, అప్పటి హై న్యాయమూర్తులు జివో చెల్లదని తీర్పును వెలువరించింది, వాస్తవానికి రిజర్వేషన్ అనేది రాజ్యాంగ పరంగా అందరినీ సమాన హక్కులు లభించాలి, మనం గమనిస్తే ముదిరాజ్ ఉన్న జాతి అత్యంత వెనుకబడిన కులం గా చెప్పవచ్చు, వీళ్ళు సామాజికంగా, ఆర్థికంగా ఎంతో వెనుకబడి ఉన్నారు అని చెప్పవచ్చు, బీసీ -డీ లో ఉండటం వల్ల వీళ్ళు ముమ్మానికి అన్యాయం జరుగుతుంది అని చెప్పవచ్చు, ప్రభుత్వ ఉద్యోగం కోసం సన్నద్ధం అవుతున్న ఎంతో మంది నిరాశ తో వెనకడుగు వేయాల్సి వస్తుంది, వీళ్లను బిసి – ఏ లో చేర్చడం ద్వారా కొంత మేర వెసులుబాటు కల్పించే విధంగా ఉంటుంది అని చెప్పాలి, కాబట్టి రాష్ట్ర బిసి కమిషన్ వెంటనే బీసీ జనాభా ప్రాతిపదికన అత్యంత వెనుకబడిన ఉన్న కులాల జాబితా తీసి సమాన అవకాశాలు అందే విధంగా చేయాలి, ముదిరాజ్ లను సైతం బిసి – డీ నుండి బీసీ – ఏ లోకి మార్చి జివో నెంబర్ 15 అమలు చేసే విధంగా చేయాలి, అదేవిధంగా రాష్ట్రం ప్రభుత్వం ముదిరాజ్ లకు న్యాయం చేయాలని కోరుకుందాం..!
కిరణ్ ఫిషర్ అడ్వకేట్
7989381219