కాశీరెడ్డిపల్లి లో ముగ్గుల పోటీలు
–పాల్గొన్న జిల్లా కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్
–మండల అధ్యక్షులు తాండ కనకయ్య గౌడ్
–ఉపాధ్యక్షులు ర్యాకం యాదగిరి
తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి జనవరి
సంక్రాంతి పండుగను పురస్కరించుకొని సోమవారం నాడు భాస్కర్ ఆధ్వర్యంలో కాశీరెడ్డిపల్లి గ్రామంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు.గ్రామానికి చెందిన మహిళలు ముగ్గుల పోటీలలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.సంక్రాంతి పండుగ ప్రతిబింజేలా గంగిరెద్దుల ముగ్గులు,హరిదాసుల కథలు,చెరుకు గడలు,పాలపొంగులు,గాలిపటాలతో కూడిన అందమైన ముగ్గులు వేశారు. ప్రథమ స్థానంలో జిన్నా వాణి,ద్వితీయ స్థానంలో దాల్ అంజలి,తృతీయ స్థానంలో అప్పాల రవళి,ప్రతిభ చాటారు.ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు జిల్లా కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు మల్లేశం గౌడ్,మర్కుక్ మండలాధ్యక్షులు కనకయ్య గౌడ్,ఉపాధ్యక్షులు ర్యాకం యాదగిరి లు బహుమతులు అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళల ఆత్మగౌరవ పండుగ సంక్రాంతి పండుగని,చేతికందిన పంటలు ఇంటికి చేరిన వేళ అని,సిరి సంపాదాలతో కళ కళలాడే పండుగే మకర సంక్రాంతి అన్నారు.పిల్లలు గాలిపటాలు,మహిళల రంగువల్లులు,పశువుల పండగను ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రేస్ పార్టీ అధ్యక్షులు సింగం వెంకటేశ్,యూత్ అధ్యక్షులు అప్పాల రమేష్,నాయకులు నర్సింలు,ఆంజనేయులు,రవి,బాబీ ప్రభాకర్,బీర్బల్ సింగ్,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.