పద్మశాలి మహిళా సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు.

పద్మశాలి మహిళా సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు.

 

తెలంగాణ కెరటం అచ్చంపేట (జనవరి 15):

 

అచ్చంపేట పట్టణంలోని శ్రీ భక్త మార్కండేయ శివాలయ ఆవరణలో పద్మశాలి మహిళ సంఘం ఆధ్వర్యంలో బుధవారం ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ ముగ్గుల పోటీలలో 35 మంది పద్మశాలి మహిళలు పాల్గొని ముగ్గులు వేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యులు వంశీకృష్ణ సతీమణి సీబీఎం ట్రస్టు చైర్మన్ చిక్కుడు అనురాధ పాల్గొని విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు పారిజాతం, శారద న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా అనురాధ మాట్లాడుతు సంక్రాంతి పండుగ సందర్భంగా గత 15 సంవత్సరాలుగా మహిళ సంఘం ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నందుకు అభినందనలు తెలిపారు. ఈ పోటీల్లో మొదటి బహుమతి పొందిన దాసు శైలజకి, పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో బహుమతి ప్రధానం చేశారు. అలాగే ద్వితీయ బహుమతి గుజ్జరి రేవతికి,శివాలయ కమిటీ , మూడవ బహుమతి వనం కవితకి, గుజ్జరి వజ్రమ్మ నాలుగవ బహుమతి, భీమనపల్లి కవితకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శైలజ రెడ్డి, కౌన్సిలర్ సునీత రెడ్డి, పద్మశాలి మహిళ సంఘం అధ్యక్షురాలు దాసుపత్రి శకుంతల, గుర్రం హైమావతి, కోట కిషోర్, ధనరాజ్, రాములు, గంజి నిర్మల, కోట ప్రశాంతి, ఇమ్మడి రాజేశ్వరి, కుకుడాల నారాయణమ్మ, దాసు జంగమ్మ, క్యామ తిరుపతమ్మ, వర్కాల బాలకిష్టమ్మలు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment