అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి..

  • విన్నర్ నేలకొండపల్లి, రన్నర్ ఖమ్మం అర్బన్ జట్లకు శుభాకాంక్షలు..::సినీ నటి స్వప్న చౌదరి అమ్మినేని, డాక్టర్ ఎంజీవి. ప్రవీణ్ కుమార్.
  • రాజీవ్ ట్రోఫీతో ప్రారంభమైన జట్లు అంతర్జాతీయ స్థాయికి ఎదగాలి..
  • క్రీడల పట్ల ఉన్న ఆసక్తిని యువత తమ ఆశయాలకు అనుగుణంగా మలుచుకోవాలి.
  • క్రికెట్ రంగంలో రాణించాలనుకునే యువతకు ఎల్లవేళలా సహకారం ఉంటుంది.::డాక్టర్ ఎ.జీ.వి.ప్రవీణ్ కుమార్.
  • క్రికెట్ కోచ్ మతీన్ సేవలు అభినందనీయం.
  • రాజీవ్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎం.జీ.వి. ప్రవీణ్ కుమార్ సినీనటి స్వప్న చౌదరి అమ్మినేని.
    *సినీనటి స్వప్న చౌదరికి సత్కారం…

ఖమ్మం స్పోర్ట్స్, ఫిబ్రవరి 23 (తెలంగాణ కెరటం): క్రీడలలో గెలుపు, ఓటములు సహజమని క్రీడా స్ఫూర్తితో ఆడుతూ.. అంతర్జాతీయ స్థాయిలో ఆడే విధంగా కృషి చేయాలని ప్రముఖ సినీ నటి స్వప్న చౌదరి అమ్మినేని, ప్రముఖ ఈఎన్ టీ వైద్యులు ఎం జి వి ప్రవీణ్ కుమార్ అన్నారు.. ఆదివారం ఫైనల్ కు చేరిన జట్లలో ఖమ్మం అర్బన్, నేలకొండపల్లి జట్లు తలపడగా ఖమ్మం అర్బన్ జట్టుపై నేలకొండపల్లి జట్టు 19.4 బంతుల్లో 129 పరుగులతో విజయం సాధించిందని, మరోసారి టొర్ణమెoట్ జరిగినపుడు ఖమ్మం జట్టు విన్నర్ స్థానంలో వుండే విధంగా కృషి చేయాలని, గెలుపొందిన విన్నర్, రన్నర్ జట్ల క్రీడాకారులకు వారు దివంగత బాబురావు రోలింగ్ ట్రోఫీని అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈసందర్భంగా డాక్టర్ ఎంజీవి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ. క్రికెట్ రంగమంటే తనకి ఎంతో ఇష్టమని. గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీనియర్ క్రికెట్ కోచ్ అనుభవజ్ఞుల ఆధ్వర్యంలో జరిగే టోర్నమెంట్లకు తన సహకారం ఎల్లవేళలా ఉంటుందని ఆయన అన్నారు.. అనంతరం సినీ నటి స్వప్న చౌదరి అమ్మినేని మాట్లాడుతూ.. మన ఖమ్మం జిల్లా ఉద్యమాలకు, కళాకారుల ఘుమ్మం అని, క్రీడాకారులకు కూడా ఖమ్మం వేదిక గా మారిందని, అభివర్ణించారు..తాను కూడా ఖమ్మం బిడ్డనేనని ఇక్కడే చదివానని.. ప్రస్తుతం సినిమా రంగంలో, యాంకరింగ్ రంగంలో కొనసాగుతున్నానని పేర్కొన్నారు.. ఖమ్మం జిల్లాకు చెందిన క్రికెట్ క్రీడాకారులు భారతదేశ సందర్భంగా ఆడుతూ ఖమ్మంతో పాటు భారతదేశానికి ఖ్యాతిని తీసుకురావాలని ఆమె ఆకాంక్షించారు.. క్రికెట్ క్రీడను ప్రోత్సహించడంలో కోచ్ మతిన్ ప్రముఖ వైద్యులు ఎంజీవి ప్రవీణ్ కుమార్ సేవలు ప్రశంసనీయమని ఆమె అన్నారు. అనంతరం జర్నలిస్టులు జానీపాషా, టీఎస్ చక్రవర్తి లు మాట్లాడుతూ.. ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభమైన రాజీవ్ ట్రోఫీ క్రికెట్ టోర్నమెంట్ 17వ క్రికెట్ టోర్నమెంట్ సక్సెస్ లో కీలక భూమిక నిర్వాహకులు మహమ్మద్ మతీన్ దేనని వారు అభివర్ణించారు.. టోర్నమెంట్ సహకారంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎంజీవి ప్రవీణ్ కుమార్ సహకారం మాటల్లో చెప్పలేనిదని పేర్కొన్నారు. అనంతరం సినీనటి స్వప్న చౌదరి అమ్మినేని కు డాక్టర్ ప్రవీణ్ కుమార్ శాలువాతో ఘనంగా సత్కరించారు అనంతరం కోచ్ మతీన్ మహమ్మద్ మతిన్ సినీనటి స్వప్న చౌదరి కు డాక్టర్ ఎంజీవి. ప్రవీణ్ కుమార్ కు జర్నలిస్టులకు ఘనంగా సత్కరించారు. డి వై ఎస్ ఓ తుంబూరు సునీల్ రెడ్డి సహకారం అభినందనీయం అని, అందుకు వారికి వారి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా క్రికెట్ క్రీడాకారులు సినీనటి రాకతో హర్షద్వారాలు చేస్తూ సెల్ఫీలు దిగుతూ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు సిద్దు,అంజలి,ఇబ్రహీం నాగి వెంకటేష్, తిలక్, సతీష్, శోభన్, యువర్ ఎంపైర్లు సీనియర్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment