మా నాన్న నిర్మించాడు నేను పునర్నిర్మాణం చేస్తా.
-దుబ్బాక నియోజకవర్గ ఇంచార్జీ చెరుకు శ్రీనివాస్ రెడ్డి
తెలంగాణ కెరటం :రాయపోల్ ప్రతినిధి :డిసెంబర్ 14
విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించి తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములను చేయాలని ప్రభుత్వం కృషి చేస్తోంది దుబ్బాక నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. దౌల్తాబాద్ మండల పరిధిలోని మహత్మా జ్యోతిరావు భాఫులే బీసీ (బాలుర) గురుకుల పాఠశాలలో కామన్ డైట్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులను చూస్తుంటే ప్రభుత్వ రెసిడెన్షియల్ స్కూల్స్ లో ప్రతిభ కలిగిన విద్యార్థులు ఉన్నారని నమ్మకం,ఆత్మవిశ్వాసం కలిగిందన్నారు.కొన్నేళ్లుగా ప్రయివేటు పాఠశాలల్లో విద్యార్థులకు టాలెంట్ ఎక్కువని,ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు తక్కువ అనే అపోహ బలంగా నాటుకుపోయిందని అలాంటి అపోహలను తొలగించాలని ప్రజా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుకున్న వారు ఎంతో మంది ఐఎఎస్, ఐపీఎస్ లుగా ఎంపికయ్యారని రెసిడెన్షియల్ స్కూల్ లో చదువుకున్న వాళ్లు ఎంతో మంది గొప్పగా రాణించారన్నారు.ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీలలో సంపూర్ణ విశ్వాసం కల్పించాలని ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చిందని విద్యా వ్యవస్థను సమూల ప్రక్షాళన చేసి, విద్యా ప్రమాణాలు పెంచాలన్న దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకు వెళుతోందని డైట్, కాస్మోటిక్,మౌలిక వసతులకు గత ప్రభుత్వం సరైన ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు.
ఇది ప్రజా ప్రభుత్వం అని నిరూపించేందుకు సింగిల్ స్ట్రోక్ లో డైట్,కాస్మోటిక్ చార్జీలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నామన్నారు పెరిగిన ధరలు,విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని డైట్ చార్జీలు 40శాతం,కాస్మోటిక్ 200 శాతం పెంచామని దేశ చరిత్రలో ఒకేసారి ఇంత మొత్తం పెంచడం ఎక్కడా జరగలేదన్నారు. ప్రయివేట్ స్కూల్స్ లో చదువు చెప్పేవారికి ప్రభుత్వ ఉపాధ్యాయుల కంటే ఎక్కువ అర్హత ఉందా?మల్టీ టాలెంటెడ్ స్థూడెంట్స్ ను మనం ఎందుకు తయారు చేయలేకపోతున్నాం.?ఎందుకు మనం ఆ ఆలోచ ఆ చేయకూడదు ఇది మన బాధ్యత కాదా అన్నారు.సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్ల లాంటివి విద్యార్థుల కోసం పెట్టేది ఖర్చు కాదు అది వారి భవిష్యత్ కు పెట్టుబడి కాదన్నారు.శ్రీమంతుడుకి ,పేదవాడికి వారి పిల్లల పట్ల ఒకే రకమైన ప్రేమ ఉంటుంది మనల్ని నమ్మి వాళ్లు హాస్టళ్లకు పంపితే మనం ఎంత బాధ్యతగా ఉండాలో ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు.
విద్యార్థులలో ఉన్న ఇతర టాలెంట్ ను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలని వారికి కావాల్సిన శిక్షణ అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో తహశీల్దార్ చంద్రశేఖర్ రావు,మండల విద్యాధికారి కనకరాజు,ఎస్సై శ్రీరామ్ ప్రేమ్ దీప్,ఏపీఎం యాదగిరి,ప్రిన్సిపాల్ స్వప్న. మండల పార్టీ అధ్యక్షుడు పడాల రాములు. సీనియర్ నాయకులు కర్నాల శ్రీనివాసరావు. కిష్టారెడ్డి. బండారు లాలు. మద్దెల స్వామి. ఆది వేణుగోపాల్. తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.