రైల్వే ఉద్యోగుల ఆధ్వర్యంలో నచ్చరాజు స్మారక వాలీబాల్ టోర్నమెంట్
తెలంగాణ కెరటం బెజ్జంకి ప్రతినిధి జనవరి 15 :
మండలంలోని గుగ్గిళ్ల గ్రామంలో సంక్రాతి పండుగ పర్వదినంను పురస్కరించుకొని గ్రామ రైల్వే ఉద్యోగుల ఆధ్వర్యంలో, గ్రామ ప్రముఖులు మాజీ సర్పంచ్ కీ.శే.నచ్చరాజు వెంకట కిషన్ రావు, ఆయన సోదరుడు నచ్చరాజు రఘునాథ రావు స్మారక వాలీబాల్ టోర్నమెంట్ ను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ టోర్నమెంట్ కు గ్రామంలోని యువకులు ఉత్సాహంతో ముందుకు వచ్చారని, పండుగ పూట స్నేహ పూర్వక వాతావరణంలో మొత్తం 14 వాలీబాల్ జట్లు పాల్గొన్నాయని, ప్రథమ బహుమతిని గుగ్గిళ్ల అంబేద్కర్ టీం, ద్వితీయ బహుమతిని ఎస్ఎస్సీ-2006 బ్యాచ్ టీం లు గెలుచుకున్నారని టోర్నమెంట్ నిర్వాహకులు విశ్వోజు రంజిత్ కుమార్, కొంకటి సురేష్, వేముల శ్రీధర్, సుంకరపెల్లి లక్ష్మణ్ లు తెలిపారు. ఈ క్రీడా పోటీలలో గెలుపొందిన విజేతలకు రైల్వే ఉద్యోగి కేడిక వీరారెడ్డి, సామాజిక కార్యకర్త మహమ్మద్ అబ్దుల్ సత్తార్, బెజ్జంకి లయన్స్ క్లబ్ అధ్యక్షులు నారోజు శంకరాచారి ముఖ్య అతిథులు గా పాల్గొని బహుమతులను అందజేశారు. ఈకార్యక్రమంలో కొంకటి ఆగయ్య, పంతంగి వెంకటేష్, ఎండి మహబూబ్, తుమ్మ రాజు, తుమ్మ సత్యం, మహమ్మద్ రఫీ, తాళ్లపల్లి వెంకటేష్ గౌడ్, చెప్యాల రమేష్, పంతంగి సాయిప్రసాద్, గుగ్గిళ్ల సునీల్, మైల భానుప్రకాష్, గుగ్గిళ్ల మధు, గుగ్గిళ్ల రమేష్, లింగాల బాబు, తిప్పరవేణి బాబు, దుగ్యాని మోహన్, పంతంగి ఆంజనేయులు, విశ్వనాథం సత్యనారాయణ, శనిగరం శ్రీనివాస్ క్రీడాకారులు, గ్రామ యువకులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.