నారాయణఖేడ్: జర్నలిస్టులు సినీ నటుడు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలి
తెలంగాణ కెరటం:నారాయణఖేడ్ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 11
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మున్సిపల్ సినీనటుడు మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని సిపిఐ జిల్లా కార్యదర్శి చిరంజీవి బుధవారం డిమాండ్ చేశారు. జలపల్లి లో కవరేజ్కి వెళ్లిన జర్నలిస్టులపై సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడాన్ని ఖండిస్తూ నారాయణఖేడ్ ఆర్డీవో కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. విషయం తెలుసుకుందామని వెళ్లిన జర్నలిస్టులపై దాడులకు దిగడం సమంజసం కాదన్నారు. జర్నలిస్ట్ సమాజానికి సినీ నటుడు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.