పూర్తిగా క్షిణించిన నరేందర్ ఆరోగ్యం,

పూర్తిగా క్షిణించిన నరేందర్ ఆరోగ్యం,

పట్టించుకొని అధికారులు.

 

తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 19;

 

ప్రాణం పోతున్నా పట్టించుకోరా.. అని ధర్మ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాసాల వినోద్ యాదవ్ అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని నిరుపేద ప్రజలకు నాణ్యమైన ఉచిత విద్య, నాణ్యమైన ఉచిత వైద్యం, నిరుద్యొగులందరికి ఉపాధి, భుమిలెని నిరుపెదలకు ఒక ఎకరం భూమి, ఇల్లు లేనివారికి 200 గజాల ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ గత మూడు రోజులుగా ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు నల్ల నరేందర్ మహారాజ్ ఆమరణ నిరాహార దీక్షకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా నడిబుడ్డున ఆమరణ నిరాహార దీక్ష చేస్తుంటే కనీసం అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. దీక్ష చేస్తున్న నరేందర్ ఆరోగ్యం చాలా క్షిణించి కనీసం మాట్లాడలేని స్థితిలో ఉన్నాడని తెలిపారు. అధికారులు స్పందించి వైద్య పరీక్షలు కూడా నిర్వహించకుండా చోద్యం చూస్తున్నారన్నారు. నరేందర్ కి ఏమైనా జరిగితే ఊరుకోబోమని, బుద్ధుడుగా ఉన్న మమ్మల్ని బ్రూస్ లీలు పర్చొద్దని హెచ్చరించారు. నల్ల నరేందర్ మాట్లాడుతూ డిమాండ్ల పరిస్కారం కోసం తన ప్రాణం పోయినా సరే ఎట్టిపరిస్థితిలో దీక్షను విరమించేది లేదని స్పష్టం చేశారు. వెంటనే ప్రభుత్వం మా ఐదు డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.

ఈ దీక్షకు జై భీమ్ ఆటో యూనియన్, లంబాడి హక్కుల సాధన సమితి, మహజన గళం కళాకారులు, వివిధ కళాశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు లింగస్వామి, శాంతి కుమార్, శివ, శ్రీకాంత్, సాయి, మహేష్, రాకేష్, నరెందర్, స్వామి, వెంకటేష్, సాయి కిరణ్, శ్రీకాంత్, పర్శురామ్, గోవర్ధన్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment