దివ్యమూర్తికి జాతీయ అవార్డు

ఖమ్మం, జనవరి 05 (తెలంగాణ కెరటం): ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం కొత్తకొత్తూరు గ్రామానికి చెందిన అపర మేధావి డాక్టర్ గుగ్గిళ్ళ దివ్యమూర్తికి విద్యా రంగంలో తాను చేసిన సేవలకు గాను ఆదివారం సావిత్రిబాయి పూలే ఎక్స్లెన్స్ జాతీయ అవార్డు వరించింది. హోప్ స్వచ్ఛంద సేవా సమితి, సింధు ఆర్ట్స్ అకాడమీ వారు హైదరాబాద్​ త్యాగరాయ గాన సభలో ఈ అవార్డును డా.దివ్యమూర్తికి అందజేశారు. అనంతరం డాక్టర్ దివ్యమూర్తిని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ అవార్డు రావడం తనకు సంతోషంగా ఉందని డా.దివ్యమూర్తి తెలియజేశారు. ఇప్పటివరకు తనకు 52 అవార్డులు వచ్చాయని, 90 చోట్ల సన్మానం జరిగిందని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దైవజ్ఞ శర్మ, దైద వెంకన్న, దైద అనిత, హమీద్ ఖాన్, ప్రవీణ్, గుగ్గిళ్ల పేరయ్య, దైద నాగరాజు, రామకృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment