---Advertisement---

గురుకుల మహిళా డిగ్రీ కళాశాల మర్కల్ నందు నేషనల్ మ్యాథమెటిక్స్ డే ను ఘనంగా నిర్వహించారు

---Advertisement---

గురుకుల మహిళా డిగ్రీ కళాశాల మర్కల్ నందు నేషనల్ మ్యాథమెటిక్స్ డే ను ఘనంగా నిర్వహించారు

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి డిసెంబర్ 21:

కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల్ తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల యందు నేషనల్ మాథమాటిక్స్ డే ను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమం లో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి. శోభారాణి , జ్యోతిప్రజ్వలన చేసి,భారత గణిత శాస్త్రవేత్త శ్రీనివాసరామానుజన్ చిత్ర పటానికి పూలమాల వేసి సత్కరించారు. ఈ కార్యక్రమం లో భాగంగా అధ్యాపకులకు, విద్యార్థులకు వివిధ రకాల పోటీలైన మెమోరి గేమ్, సుడోకు, మాథ్స్ మేజ్, క్విజ్, పోస్టర్ ప్రెసెంటేషన్, షార్ట్ ట్రిక్స్ ఇన్ మాథ్స్ లను నిర్వహించి, గెలుపొందిన అధ్యాపకులకు, విద్యార్థులకు బహుమతులు ప్రధానం చేసారు.ఈ కార్యక్రమం లో కళాశాల వైస్ ప్రిన్సిపల్ ఉదయిని, గణిత విభాగాధిపతి శ్రీలత, ఫాకల్టీ జి. వనజ, స్టాటిస్టిక్స్ ఫాకల్టీ సుజాత, అఖిల మరియు అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment