ఏనగుర్తిలో కొత్తరాతి యుగం ఆనవాళ్లు

ఏనగుర్తిలో కొత్తరాతి యుగం ఆనవాళ్లు

 

దుబ్బాక:డిసెంబర్19,(తెలంగాణ కెరటం )

సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలంలోని ఎనగుర్తి గ్రామంలోని  కాశీవిశ్వనాథ  స్వామి దేవాలయం సమీపంలోని  బండల మీద పూరామానవులు తమ ఆహార సేకరణలో భాగంగా  ఉపయోగించే రాతి పనిముట్లు( రాతి గొడ్డళ్ళు) నూరుకున్న సూరుడు గుంతల (గ్రూమ్స్) ను చరిత్ర పరిశోధకుడు  కొలిపాక  శ్రీనివాస్  గుర్తించాడు.  ఆయన మాట్లాడుతూ, కొత్తరాతి యుగం  నాటి ఆదిమమానవులు   ఎక్కువగా రాతి పనిముట్లు తయారు చేసుకుని తమ జీవనాన్ని కొనసా గించారని ఆయన  వివరించారు.రాతి పనిముట్లతోనే వ్యవసాయం సాగు చేశారని పేర్కొన్నారు.  బండ మీద  దాదాపు 20కి పైగా (గ్రూవ్స్) నూరిన గుంటలు  ఉన్నాయని , వీటిని బట్టి       ఈ ప్రాంతం వేలయేండ్ల నుంచి  మానవులకు  ఆవాసంగా  ఉందని  చెప్పవచ్చు.

Join WhatsApp

Join Now

Leave a Comment