నెర్మట రోడ్డును మరమ్మత్తులు చేయాలి
-నెర్మట బిఆర్ఎస్ నాయకులు డిమాండ్
-గుంతలుగా మారిన వైనం, పట్టించుకోని అధికారులు
-రోడ్డు కు ఇరువైపులా పెరిగిన చెట్లు
తెలంగాణ కెరటం నల్గొండ జిల్లా ప్రతినిధి
మునుగోడు నియోజకవర్గం చండూరు మండల పరిధలో ఉన్న నెర్మట గ్రామానికి వెళ్ళాలంటే రోడ్డు అంత గుంతలగా మారింది అని, రోడ్డు మరమత్తులు చేయాలని ఆ గ్రామ బిఆర్ఎస్ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు, ఈ సందర్భంగా సీనియర్ బిఆర్ఎస్ నాయకులు బండమిది వేణు మాట్లాడుతూ దోనిపాముల నుండి నెర్మట వెళ్ళే దారిలో రోడ్డు అంత గుంతలుగా మరింది అని, రోడ్డుకు ఇరువైపులా భారీ గుంతలు ఏర్పడ్డాయి అని అన్నారు, అదేవిధంగా రోడ్డుకు ఇరువైపుల చెట్లు పెరగటం వల్ల ఎదురుగు వచ్చే వాహనాలు కనిపించడం లేదని అన్నారు, వెంటనే ప్రభుత్వం రోడ్డు వెడల్పు వేయాలని, లింక్ రోడ్లు కూడా వేయాలని అన్నారు, ప్రభుత్వ అధికారులు స్పందించాలని కోరారు, ఆయన వెంట బుర్కల సైదులు కొంపల్లి అనిల్, నారపాక వినోద్ తదితరులు పాల్గొన్నారు