నూతన అంబులెన్స్108 ప్రారంభించిన ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్
తెలంగాణ కెరటం డిసెంబర్ 10 ధర్మపురి నియోజకవర్గం ప్రతినిధి
ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చొరవతో జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలానికి మంజూరు అయినా 108 అంబులెన్సును మంగళవారం రోజున వెల్గటూర్ సివిల్ ఆసుపత్రి వద్ద ప్రభుత్వ విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జిల్లా వైద్య అధికారులు మరియు మండల నాయకులతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూవెల్గటూర్ మండలానికి ప్రభుత్వం నుండి మంజూరు అయిన 108 అంబులెన్సును ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని, ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి,వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కి ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని,మాజీ ముఖ్యమంత్రి కీ.శే వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఈ 108 అంబులెన్సును ఇప్పటికీ కొనసాగించడం జరుగుతుందని, మండల ప్రజలు వైద్య అధికారుల ను ఇట్టి అంబులెన్సు సేవలను వినియోగించుకోవాలని,అదే విధంగా ధర్మపురిలో మాత శిశు ఆసుపత్రిని మరియు జిల్లా సివిల్ ఆసుపత్రి లో ఐసీయూ యూనిట్ నీ త్వరలోనే ప్రారంభిస్తామని,నియోజక వర్గంలో వైద్య పరమైన ఎటువంటి అవసరం ఉన్న నా దృష్టికి తీసుకురావాలని ఈ సందర్భంగా తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు