విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం
తెలంగాణ కెరటం, జగిత్యాల ప్రతినిధి, డిసెంబర్ 27 :
కోరుట్ల పట్టణం శ్రీనివాస రోడ్డులోని విశ్వబ్రాహ్మణ సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నూతన అధ్యక్షులుగా మండలోజు పవన్, ఉపాధ్యక్షులుగా కత్తిరాజ్ శంకర్, వి.మారుతి, ప్రధాన కార్యదర్శిగా వనతడుపుల సంజీవ్, కోశాధికారిగా జి.శ్రీధర్, సహాయ కార్యదర్శిగా బి.సత్యం, సాంస్కృతిక కార్యదర్శిగా వి.సాగర్, ముఖ్య సలహాదారులుగా గుండోజి శ్రీనివాస్, వనతడపుల ఈశ్వర్, గుండోజి సత్యప్రసాద్, మంతెన చంద్రప్రకాష్, పవన్, వి,రమేష్, తదితర కార్యవర్గ సభ్యులు, ప్రమాణ స్వీకారం చేశారు.