---Advertisement---

తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో నూతన మెనూ ఆవిష్కరణ కార్యక్రమం *

---Advertisement---

*తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాలలో నూతన మెనూ ఆవిష్కరణ కార్యక్రమం *

 

తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి

 

తెలంగాణ మైనారిటీ గురుకుల పాఠశాల భువనగిరి నందు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి నూతన మెనూ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి భువనగిరి మున్సిపల్ చైర్మన్ శ్రీ పోతంశెట్టి వెంకటేశ్వర్లు గారు మరియు జిల్లా ఫైర్ అధికారి శ్రీ మధుసూదన్ రావు గారు పేరెంట్స్ పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ మరియు రీజినల్ కో ఆర్డినేటర్ శ్రీకాంత్ గండ్ర, ఉపాద్యాయులు,విద్యార్థులు అతిధులను ఘనంగా స్వాగతం పలికగా, తదుపరి రాష్ట్ర ప్రభుత్వము మరియు జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు అతిధులు పాఠశాలను సందర్శించి పాఠశాలలో ఉన్నటువంటి తరగతి గదులు పిల్లలు విద్యార్థులు నివసించేటువంటి డార్మెట్రీలు స్టోర్ రూమ్, బాత్ రూమ్, కిచెన్ ను పరిశీలించడం జరిగింది. తర్వాత ప్రభుత్వం అన్ని గురుకులాలలో కామన్ గా రూపొందించినటువంటి ఒకే రకమైనటువంటి డైట్ మెనూ ఆవిష్కరించడం జరిగింది. అనంతరం పాఠశాలలో ఏర్పాటుచేసినటువంటి సభ యందు పాల్గొని తల్లిదండ్రులతో పిల్లలతో ముచ్చటించడం జరిగింది ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి అన్ని వసతులను విద్యార్థులు సక్రమంగా వినియోగించుకుని విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని ఈ మైనార్టీ గురుకుల పాఠశాల బోనగిరిలో కాకుండా జిల్లా స్థాయిలో రాష్ట్రస్థాయిలో మంచి ఫలితాలను సాధించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలవాలని ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా పోతంశెట్టి వెంకటేశ్వర్ గారు మాట్లాడుతూ పాఠశాలలో అన్ని సౌకర్యాలు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సూచనల మేరకు సమగ్రంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. తల్లిదండ్రులు మీ పిల్లలు గూర్చి చింతపడాల్సిన అవసరం లేదని అన్ని వసతులు సమకూర్చి వారి భవిష్యత్తు తీర్చిదిద్దటానికి ప్రభుత్వం కంకణ బద్దమై ఉందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మరియు రీజినల్ కో ఆర్డినేటర్ శ్రీకాంత్, ఉపాద్యాయులు, పేరెంట్స్ కమిటీ చైర్మన్ డాక్టర్.శేక్ హమీద్ పాష, భువనగిరి ఫైర్ ఇన్స్పెక్టర్ మధుకర్,మైనారిటీ నాయకులు, మజహర్, కూర వెంకటేష్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment