నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించిన
–దుబ్బాక సీఐ శ్రీనివాస్
–ఎస్సై గంగరాజు
దుబ్బాక:జనవరి11,(తెలంగాణ కెరటం)
సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలో శుక్రవారం రోజున తెలంగాణ కెరటం తెలుగు దినపత్రిక నూతన సంవత్సర క్యాలండర్ ను, దుబ్బాక సీఐ శ్రీనివాస్, ఎస్ఐ గంగరాజు చేతుల మీదుగా తెలంగాణ కెరటం దినపత్రిక నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అనతికాలంలోనే తెలంగాణ కెరటం దినపత్రిక చైర్మన్ కుక్కల.రాజు, స్టేట్ ఇంచార్జ్ ఆకుల.హరిదీప్ ఆధ్వర్యంలో గుర్తింపు పొంది. తెలంగాణ కెరటం దినపత్రికలో దమ్మున్న వార్తలు రాస్తూ పత్రిక విలువలు కాపాడుతూ ఎవరికి అనుకూలంగా కాక నిష్పక్షపాతంగా, స్వతంత్రంగా ప్రజల పక్షాన నిలబడి తెలంగాణ కెరటం దినపత్రిక వార్తలు రాస్తుందన్నారు.నిరంతరం ప్రజల సమస్యలు ప్రభుత్వానికి తెలియజేస్తుందని వారు కొనియాడారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది,తెలంగాణ కెరటం దినపత్రిక విలేకరి కంచర్ల శివకుమార్, కారంపూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.