నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి – ఎస్సై శీలం లక్ష్మణ్
తెలంగాణ కెరటం ధర్మపురి నియోజకవర్గ ప్రతినిధి డిసెంబర్ 30
జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గం ధర్మారం మండల ప్రజలు నూతన సంవత్సర వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని ఎస్సై శీలం లక్ష్మణ్ కోరారు. ప్రశాంతవాతావరణంలో ఇతరులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్వహించుకోవాలని ఎస్సై విజ్ఞప్తి చేశారు. కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని ర్యాష్ బైక్ డ్రైవింగ్,త్రిబుల్ రైడింగ్ చేయడం, ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించడం,రాకపోకలకు అంతరాయం కలిగించడం,డీజే స్పీకర్లు పెట్టి ప్రజలను ఇబ్బంది పెట్టడం, రోడ్లపై మద్యం సేవిస్తూ తిరగడం, మాదక ద్రవ్యాలు (డ్రగ్స్), గంజాయి సేవించడం వంటి అసాంఘిక పనులకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని ఎస్సై హెచ్చరించారు. ఇలాంటి వాటిని అరికట్టడానికి తమ సిబ్బందిని అన్ని ప్రదేశాల్లో నిఘా ఉంచి పర్యవేక్షిస్తామని ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా ప్రవర్తించేవారు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని ఎస్సై లక్ష్మణ్ వెల్లడించారు.ధర్మారం మండల ప్రజలకు ఎస్సై ముందస్తుగా నూతన సంవత్సర 2025, సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.