న్యాయ్ పాదయాత్ర ఆగ్రా జిల్లా ఇన్‌చార్జిగా నీలం రమేశ్
తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి జనవరి 01.
కామారెడ్డి: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టనున్న కిసాన్ మజ్దూర్ సమ్మాన్ న్యాయ్ పాదయాత్ర ఆగ్రా జిల్లా ఇన్‌చార్జిగా నీలం రమేశ్ కు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ వైస్ ఛైర్మన్ అఖిలేష్ శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన నీలం రమేశ్ గతంలో వైఎస్సార్ టీపీలో పని చేశారు. ప్రస్తుతం షర్మిలతో పాటు ఆయన కాంగ్రెస్‌లోనే ఉన్నారు. గత ఎన్నికలకు ముందు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్ టీపీ చీఫ్ షర్మిల చేపట్టిన పాదయాత్ర ఇన్ ఛార్జిగా పని చేసిన నీలం రమేశ్ పాదయాత్ర విజయవంతానికి కృషి చేశారు.