అయ్యప్ప మాలలు భక్తి భావాన్ని,హిందూ సంప్రదాయాన్ని పెంపొందిస్తాయి
• అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ అధ్యక్షులు ఆంజనేయులు గుప్త
తెలంగాణ కెరటం చేర్యాల ప్రతినిధి నవంబర్ 29:
పరమ పవిత్రంగా భావించే కార్తీక మాసం అయ్యప్ప మాలధారణ స్వాములకు అన్నప్రసాదం చేయడం ఎంతో పుణ్యముగా భావిస్తున్నామని, తోటి వారితో సోదర భావంతో మెలిగి ప్రేమ దయ మానవత్వం కలిగి ఉండటం అయ్యప్ప మాల ధారణ ముఖ్య ఉద్దేశమని అయ్యప్ప స్వామి ఆలయ ట్రస్ట్ అధ్యక్షులు తాటిపెల్లి ఆంజనేయులు గుప్త అన్నారు. శుక్రవారం చేర్యాల పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాలుగా జరుగుతున్న అన్నప్రసాద కార్యక్రమాన్ని శుక్రవారం ఆంజనేయులు గుప్త, కమిటీ సభ్యులు ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆంజనేయులు గుప్త మాట్లాడుతూ. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని వివిధ దేవత మాల ధారణ స్వాములకు మకర జ్యోతి దర్శనం కు వెళ్లే వరకు ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వాములకు ఏర్పాటు చేస్తున్న అన్నప్రసాదం చేయడానికి ముందుకు వస్తున్న భక్తులను చూస్తుంటే హర్షనీయం అభినందనీయమన్నారు. పవిత్రమైన కార్తీక మాసంలో మాల ధారణ స్వాములు పవిత్రంగా భోజనం వండి వడ్డించడం ప్రశంసించదగ్గ విషయం అన్నారు. మాల ధారణ స్వాములకు చేసే అన్నప్రసాదం ఎంతో సత్ఫలితాలనిస్తుందన్నారు. అయ్యప్ప మాలలు సమాజంలో భక్తి భావాన్ని పెంపొందించడంతో పాటు హిందూ సాంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయన్నారు. అయ్యప్ప స్వామి కరుణా కటాక్షంతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని అయ్యప్పస్వామిని వేడుకున్నట్లు ఆంజనేయులు గుప్త తెలిపారు. అయ్యప్ప స్వాములకు అన్నప్రసాదం చేయాలనుకునే దాతలు ఆలయ కమిటీని లేదా ఫోన్ :95730 62806, 991-221-4403 ను సంప్రదించాలని ఆంజనేయులు గుప్త సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప స్వాములు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.