అర్ధరాత్రి వేళ, తాళాలు వేసిన ఇండ్లనే టార్గెట్ చేసి దొంగతనలకు పాల్పడుతున్న పాత నేరస్తుడి అరెస్ట్:

అర్ధరాత్రి వేళ, తాళాలు వేసిన ఇండ్లనే టార్గెట్ చేసి దొంగతనలకు పాల్పడుతున్న పాత నేరస్తుడి అరెస్ట్:

 

డీఎస్పీ నల్లపు లింగయ్య.

 

తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి,

 

 

 

 

నారాయణపేట జిల్లా పరిధిలో అర్ధరాత్రి సమయంలో తాళాలు వేసి ఉన్న ఇండ్లనే టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని *డిఎస్పి నల్లపు లింగయ్య* తెలిపారు.నారాయణపేట జిల్లా పరిధిలో గత కొంతకాలంగా మరికల్ నారాయణపేట దామరగిద్ద నారాయణపేట రూరల్ పోలీస్ స్టేషన్, మక్తల్, కోస్గి తది తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనాలకు పాల్పడిన నేరస్తునికి సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో డి.ఎస్.పి నల్లపు లింగయ్య పోలీస్ అధికారులతో కలిసి పత్రిక సమావేశం ఏర్పాటుచేసి నిందితుని వివరాలు వెల్లడించారు.నిందితుని వివరాలు: చాపలి భాస్కర్ తండ్రి మహదేవ్, వయస్సు : 35 సంవత్సరాలు , కులం : ముదిరాజ్ , వృత్తి :కూలీ, గ్రామం ఉట్కూర్ గ్రామం మండలం, నారాయణపేట జిల్లా, ప్రస్తుతం చంపాపేట, హైదరాబాద్.

 

నిందితుని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న సొత్తు వివరాలు:

248 గ్రాముల బంగారం విలువ దాదాపు 19,40,000/- (పడదొమ్మిది లక్షల నలభై వేలు )

వెండి దాదాపు 1400 గ్రాములు విలువ దాదాపు 1,50,000/- (లక్ష యాభై వేల రూపాయలు)

ఒక ఐరన్ రాడ్

ఒక క్యారీ బ్యాగ్

 

ఊట్కూరు మండల కేంద్రానికి చెందిన చాపల భాస్కర్ తండ్రి పేరు మహాదేవ్ అనే వ్యక్తి పాత నేరస్థుడు. ఇతను గతంలో మక్తల్, ఊట్కూరు, మద్దూరు తదితర ప్రాంతాల్లో రాత్రిపూట ఇంటి తాళాలు పలగగొట్టి సొమ్ము దొంగిలించిన దొంగతనం కేసులలో అరెస్ట్ కబడి జైలుకు వెళ్ళినాడు. అదే క్రమంలో ఇతను గతంలో తన గొంతు కోసుకొని ఆత్మహత్య ప్రయత్నం కూడా చేసినాడు. మహబూబ్నగర్ జైల్లో ఉండగా వైద్యం నిమిత్తం ఇతని పోలీస్ ఎస్కార్ట్ మహబూబ్నగర్ జనరల్ హాస్పిటల్ కి తీసుకెళ్లగా ఇతను మహబూబ్నగర్ జనరల్ హాస్పిటల్ నుండి 2018 ఆగస్టు 10వ తారీఖున పోలీస్ ఎస్కార్ట్ నుంచి తప్పించుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలం బెంగళూరులో ఉండి తిరిగి హైదరాబాద్కు వచ్చి అక్కడ కాటేదాన్ ఏరియాలో కొంతకాలం కూలీ పని చేసి అక్కడి నుండి హైదరాబాదులోని చంపాపేట్ ఏరియాలో గల సరస్వతి నగర్ లో నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం అక్కడే నివసిస్తున్నాడు. అతను తన ఖర్చులకి డబ్బులు సరిపోకపోవడంతో తిరిగి గత రెండు సంవత్సరాలుగా దొంగతనాలు చేయడం మొదలుపెట్టి నారాయణపేట, మరికల్, మక్తల్, వికారాబాద్ జిల్లాలోని కొడంగల్, బొమ్రాస్పేట్, పరిగి ఏరియాలలో చాలా దొంగతనాలకు పాల్పడినాడు. అదే క్రమంలో ఈరోజు తెల్లవారుజామున మరికల్లో దొంగతనం చేయడానికి రాగా వాహనాల తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపిస్తే పట్టుకొని విచారించగా ఇతను నారాయణపేట, మరికల్, మక్తల్, కోస్గి కి సంబంధించిన దాదాపు 13 కేసులు రాత్రిపూట ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనాలు చేయడం జరిగింది అని అట్టి దొంగతనాలకు సంబంధించి నిందితుని వద్ద నుండి మొత్తం సుమారు 284 గ్రాముల బంగారం, 1400 గ్రాముల వెండి మరియు అతని దొంగతనం చేయడానికి ఉపయోగించే ఒక ఐరన్ రాడ్ అతని బ్యాగును స్వాధీనం చేసుకొని నేరస్తుని రిమాండ్ కు తరలించడం జరిగిందని డిఎస్పి తెలిపారు.   ఇట్టి కేసులు చేదించడంలో బాగా పనిచేసిన మరికల్ సీఐ.కే రాజేందర్ రెడ్డి, నారాయణపేట సీఐ, శివ శంకర్, మరికల్ ఎస్సై రాములు, నారాయణపేట ఎస్ఐ వెంకటేశ్వర్లు, అలాగే మరికల్ నారాయణపేట క్రైమ్ సిబ్బందిని అయిన ఎస్ . రవీందర్ నాథ్, తిరుపతి రెడ్డి, లింగమూర్తి, అంజనేయులు, రాములు లను డీఎస్పీ అభినందించి క్యాష్ రివార్డ్ ఇవ్వడం జరిగింది.

Join WhatsApp

Join Now

Leave a Comment