---Advertisement---

ఈ నెల 15నాడు సిద్దిపేటలో జరిగే ప్రజామహ సభలో గద్దర్ పుస్తకాల అవిష్కరణ.

---Advertisement---

ఈ నెల 15నాడు సిద్దిపేటలో జరిగే ప్రజామహ సభలో గద్దర్ పుస్తకాల అవిష్కరణ.

 

_డిబిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు

 

తెలంగాణ కెరటం:రాయపోల్ ప్రతినిధి :డిసెంబర్

ఈ నెల 15 న సిద్దిపేట విపంచి కళా నిలయం లో గద్దర్ పౌండెషన్ అధ్వర్యంలో జరిగే ప్రజా మహసభలో ప్రజా యుద్ద నౌక గద్దరన్న రచించిన నాలుగు పుస్తకాలను అవిష్కరించనున్నట్లు దళిత బహుజన ఫ్రంట్ జిల్లా ప్రధాన కార్యదర్శి బ్యాగరి వేణు తెలిపారు. గురువారం నాడు గద్దర్ ప్రజామహసభ కరపత్రాలను రాయపోల్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద, రాయపోల్ మండలం పెద్ద అరేపల్లి గ్రామాల్లో విడుదల చేశారు.ఈ సందర్భంగా బ్యాగరి వేణు మాట్లాడుతూ ఈ నెల 15 న ఆదివారంనాడు ఉదయం పది గంటలకు సిద్దిపేట బైపాస్ రొడ్డులోని విపంచి కళా నిలలయం లో జరిగే ప్రజా మహసభ కు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఈ మహ సభ కు ముఖ్య అతిధి మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరిష్ రావు, ప్రెస్ అకాడమి మాజీ చైర్మన్ అల్లం నారాయణ, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య, తెలంగాణ సాహిత్య అకాడమి మాజి చైర్మన్ నందిని సిధారెడ్డి,కవి,గాయకులు ,ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే,తెలంగాణ సాంస్కృతిక సారధి మాజీ చైర్మన్ రసమయి బాలకిషన్,గద్దర్ పౌండెషన్ వ్వవస్ధాపక కార్యదర్శి,గద్దర్ కుమారుడు జి.వి.సూర్యకిరణ్ ,డిబిఎఫ్ జాతీయ కార్యదర్శి పి.శంకర్ వివిధ ప్రజా సంఘాల నేతలు పాల్గోంటారని తెలిపారు. ఈ మహ సభ లో గద్దర్ రాసిన పుస్తకాలైన పాటల జీవకణం,తరగని గని,లష్కర్, అండర్ గ్రౌండ్ పుస్తకాలను అవిష్కరించనున్నామన్నారు.ఈ మహసభ ను ఉమ్మడి మెదక్ జిల్లా ప్రజలు,ప్రజా సంఘాలు దళిత,బహుజన సంఘాలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పుట్టరాజు, విలేకరులు, కనుకస్వామి, శ్రీనివాస్, మాల మహానాడు నాయకులు బాలరాజు, నాయకులు లింగం. తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment