పద్మశాలి సమాజం సిద్దిపేట జిల్లా నూతన క్యాలెండర్ ఆవిష్కరణ
దుబ్బాక:జనవరి,(తెలంగాణ కెరటం)
దుబ్బాక పట్టణంలో మంగళవారం రోజున స్థానిక పద్మశాలి భవన్ లో, పద్మశాలి సమాజం, సిద్దిపేట జిల్లా నూతన క్యాలెండర్ ను ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా పద్మశాలి సమాజం అధ్యక్షులు డాక్టర్ సుగుణ సతీష్,బూర మల్లేశం,జోగు బిక్షపతి మరియు దుబ్బాక పద్మశాలి సమాజం అధ్యక్షులు జిందం గాలయ్య, పాండి పెద్దలు, యువజన సంఘం సభ్యులు, పద్మశాలి సమాజం సభ్యులు పాల్గొన్నారు.