సీసీ కెమెరాల నిఘాలో పాములపర్తి గ్రామం
సీసీ కెమెరాలు ప్రారంభించిన గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి
–మర్కుక్ మండల ఎస్ఐ ఓ.దామోదర్
తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి జనవరి 10,
మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో తాజా మాజీ సర్పంచ్ తిరుమల్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గజ్వేల్ రూలర్ సిఐ మహేందర్ రెడ్డి,మర్కుక్ మండల ఎస్ఐ దామోదర్ ప్రారంభించారు.కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా ప్రజా ప్రతినిధులు,గ్రామ ప్రజల సమక్షంలో గ్రామంలో ప్రధాన కూడళ్లలో ప్రవేశం,నిష్క్రమణ ప్రదేశాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని సీఐ మహేందర్ రెడ్డి తెలియజేశారు.గ్రామ ప్రజల బాగోగుల గురించి ఆలోచించి సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినందుకు మాజీ సర్పంచ్ తిరుమల్ రెడ్డిని సీఐ మహేందర్ రెడ్డి అభినందించారు.ఈ సందర్భంగా గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి,మర్కుక్ ఎస్ఐ దామోదర్ మాట్లాడుతూ సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన గ్రామ ప్రజలను గ్రామ పెద్దలను అభినందించారు.సీసీ కెమెరాల వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయని సిసి కెమెరాలు ఉన్న గ్రామాలలో ఎలాంటి కేసులు నమోదు కావడం లేదని,ఏ చిన్న సంఘటన జరిగినా సీసీ కెమెరాల ద్వారా వెంటనే తెలుసుకోవచ్చని సీసీ కెమెరాలు మరింత భద్రత,సెన్సాఫ్ సెక్యూరిటీ కల్పిస్తాయని తెలియజేశారు.సీసీ కెమెరాలు రాత్రింబవళ్లు 24 గంటలు ప్రజలకు రక్షణగా నిలుస్తాయన్నారు.గ్రామంలో ఎవరైనా అనుమానస్పదంగా తిరిగితే వెంటనే గుర్తించవచ్చని,సీసీ కెమెరాలు గ్రామస్తులకు గ్రామ ప్రజలకు ఎల్లవేళలా రక్షణ కవచంగా ఉంటాయని తెలిపారు.మండలంలోని కొన్ని గ్రామాలలో సీసీ కెమెరాలు ఉండి పని చెయ్యడం లేదని,సిసి కెమెరాలు లేని గ్రామాల్లో ప్రజలు,ప్రజాప్రతినిధులు,వ్యాపారస్తులు,సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీసులకు సహకరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తాండ కనకయ్య గౌడ్,మాజీ ఉపసర్పంచ్ పద్మ నర్సింలు,కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు క్రాంతి కుమార్,మల్లారెడ్డి,మండల బీజేపీ పార్టీ ఉపాధ్యక్షులు మహేష్ గౌడ్,గ్రామస్తులు లక్ష్మణ్,స్వామి తదితరులు పాల్గొన్నారు.