మెదక్ జిల్లా వాసికి పండగ సాయన్న అవార్డు.
రామాయంపేట పట్టణానికి చెందిన పోచమ్మల అశ్విని ముదిరాజ్ కు పండగ సాయన్న అవార్డు లభించింది.
తెలంగాణ కెరటం ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి జనవరి
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణానికి చెందిన పోచమ్మల అశ్విని ముదిరాజ్ కు పండగ సాయన్న అవార్డు లభించింది.ఆదివారం హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో పండగ సాయన్న సేవా సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోదండరాం,ట్రస్ట్ ఫౌండర్ శివ ల చేతుల మీదుగా అశ్విని అవార్డు అందుకుంది.ఈ సందర్బంగా ఆమెను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ బ్రిటిష్ పాలకుల చేతిలో భారతీయులు అల్లాడిపోతున్న సమయంలో పెద్దదారి వ్యవస్థను కూకటివేళ్లతో సహా కదిలించిన మహాత్ముడు పండగ సాయన్న అని వారు కొనియాడారు.తనను జైలులో నిర్బంధించగా జైలు గోడలను బద్దలు కొట్టుకొని వచ్చిన మహాబలవంతుడన్నారు. పెద్దోళ్లను దోచి పేదోళ్లకు పంచిపెట్టేవాడని గుర్తుచేశారు. బలహీన వర్గాల ఆశాజ్యోతి పండగ సాయన్న అని, అయన గొప్పతనం గురించి ఎంత చెప్పిన తక్కువేనన్నారు. అనంతరం అవార్డు గ్రహిత అశ్విని మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజలకు నేను చేస్తున్న సేవలను గుర్తించి నాకు మహనీయుడు తెలంగాణ రాబిన్ హుడ్ పండగ సాయన్న ముదిరాజ్ గారి రాష్ట్రస్థాయి సేవా అవార్డు ఇవ్వడం తో సంతోషం గా ఉందన్నారు.తనకు వచ్చిన అవార్డు మరింత బాధ్యత పెంచిందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి,మహిపాల్ యాదవ్, నిజ్జన రమేష్ తదితరులు నాయకులు పాల్గొన్నారు.