*సీఎం రిలీఫ్ పంఢ్ చెక్కులను పంపిణీ చేసిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్*
తెలంగాణ కెరటం డిసెంబర్ 18 జిన్నారం మండలం పటాన్ చెరువు ప్రతినిధి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తామంతా నిరంతరం ప్రజల శ్రేయస్సు కోసం పనిచేస్తున్నామని సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా పేద బడుగు బలహీన వర్గాల వారికి ఎల్లప్పుడూ అండగా నిలుస్తున్నామని *పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్* అన్నారు. కష్టకాలంలో వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొంది అనంతరం ముఖ్యమంత్రి సహాయనిధి కోసం దరఖాస్తు చేసుకున్న గుమ్మడిదల గ్రామానికి చెందిన వీరారెడ్డి బచ్చుగూడ గ్రామానికి చెందిన కిష్టమ్మ లబ్ధిదారులకు జిన్నారం మండలం సొలక్ పల్లి గ్రామంలో చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చెక్కులు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు.