టీచర్ల పెండింగ్ బిల్లులను విడుదల చేయాలి.
పూర్తి పైరవీలకు నిలయమైన ఆర్థిక శాఖ.
కరువు భత్యాన్ని వెంటనే విడుదల చేయాలి.
టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు యాదగిరి.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 10:
దీర్ఘకాళీకంగా పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు కొంగోటి యాదగిరి డిమాండ్ చేశారు.పెండింగ్ బిల్లులు చెల్లింపుల్లోని అక్రమాలను అరికట్టాలన్నారు. ఆర్థిక శాఖ పూర్తిగా పూర్తి పైరవీలకు నిలయంగా మారిందని విమర్శించారు.మంగళవారం టిపిటిఎఫ్ మెదక్ జిల్లా కమిటీ సమావేశం ఉపాధ్యాయ భవనం లో జరిగింది. ఈ సందర్బంగా యాదగిరి మాట్లాడుతూ జిల్లాలో ఉపాధ్యాయులు ఉద్యోగులు తాము దాచుకున్నటువంటి జిపిఎఫ్ పార్ట్ ఫైనల్ , అడ్వాన్స్ లు చెల్లించడం సంవత్సరాల తరబడి పెండింగ్ లో ఉండడం వారు వారి వ్యక్తిగత అవసరాల కొరకు ఉపయోగపడతాయని అనుకున్న డబ్బులు సమయానికి రాక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వాపోయారు. జిపిఎఫ్ చెల్లింపులలో ఒక క్రమ పద్ధతి లేకుండా చెల్లింపులు జిల్లాలో జరుగుతున్నాయని ఆరోపించారు. ఆర్థిక శాఖ పూర్తి పైరవీకారులతో నడుస్తుందని అయన విమర్శించారు.జిల్లాలో జిపిఎఫ్ చెల్లింపులు ఏప్రిల్ మే 2023 చెల్లింపులు చెల్లించకుండా మే 2024 చెల్లింపులు చెల్లించడం దీనికి నిదర్శమన్నారు.ఇప్పటికైనా ఒక క్రమ పద్ధతిలో సీనియారిటీ ప్రకారం చెల్లింపులు జరపాలని లేనియెడల పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కాలం పాటు చేసినటువంటి కార్యక్రమాలపై ఉత్సవాలు నిర్వహిస్తున్న సందర్భంగాఉద్యోగులకు,ఉపాధ్యాయులకు సంబంధించి చాలా సమస్యలు పెండింగ్లో ఉండడం ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలను తీవ్ర నైరాష్యంలోకి నెట్టివేసిందని విమర్శించారు. తమ మేనిఫెస్టో లో హామీ ఇచ్చిన విధంగావెంటనే 4 విడతల కరువు భత్యాని చెల్లించాలని డిమాండ్ చేశారు.రిటైరవుతున్నటువంటి ఉద్యోగులకు చెల్లించాల్సినటువంటి కమిటేషన్ గ్గ్రాడ్యుటీ డబ్బులు చెల్లించకుండా పెండింగ్ లో ఉంచడం 30, 40 ఏండ్లుగా ప్రభుత్వానికి సేవ చేసిన సందర్భంలో ఎలాంటి డబ్బులు చెల్లించకుండా రిటైర్ కావడం దుర్మార్గమన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల గ్రాడ్యుటీ కమ్యూటేషన్ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల చాలా సమస్యలు పెండింగ్లో ఉన్నాయని వాటిపై ప్రభుత్వం ఇకనైనా దృష్టి సారించాలని కోరారు.జిల్లాలో పదవ తరగతి మూల్యాంకన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.మెదక్ జిల్లాను రాజన్న సిరిసిల్లా జోన్ నుండి చార్మినార్ జోన్ లోకి కలుపాలని డిమాండ్ చేశారు.మన ఊరు మన బడి నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకట్రామి రెడ్డి కమిటీ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి,సురేందర్,భాగ్య లక్ష్మి,గోపాల్, సాయి బాబా,రాజయ్య, దేవి సింగ్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సంగయ్య, హీరా లాల్,రమేష్, రజిత,సంగీత తదితరులు పాల్గొన్నారు.