---Advertisement---

ధర్మసమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సదాశివ నగర్ మండల తాసిల్దార్ కి వినతి పత్రం 

---Advertisement---

ధర్మసమాజ్ పార్టీ ఆధ్వర్యంలో సదాశివ నగర్ మండల తాసిల్దార్ కి వినతి పత్రం

తెలంగాణ కెరటం కామారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 30:

కామారెడ్డి జిల్లా ధర్మ సమాజ్ పార్టీ సదాశివానగర్ మండల కమిటీ ఆధ్వర్యంలో,పేద మధ్యతరగతి వర్గాలైన బీసీ ఎస్సీ ఎస్టీ ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారం కోసం సదాశివానగర్ మండల కేంద్రం లో ధర్నా చేసి ఎమ్మార్వో గంగసాగర్ కు రిప్రెసెంటేషన్ ఇవ్వడం జరిగింది. డిమాండ్స్:1. ప్రతి బిడ్డకి నాణ్యమైన ఉచిత విద్య అందించాలి లేదా ప్రతి బిడ్డకు కేజీ నుంచి పీజీ వరకు సంవత్సరం లక్ష రూపాయలు ప్రభుత్వం ఇవ్వాలి.2.నాణ్యమైన ఉచిత వైద్యం అందించాలి లేదా ప్రతి వ్యక్తికి ప్రభుత్వం సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు ఇవ్వాలి.3. ప్రజలందరికీ చేసుకోవడానికి వారి వారి అర్హతలను బట్టి గౌరవప్రదమైన ఉపాధి కల్పించాలి.4. 25% విద్యకు, 25% వైద్యానికి 25% నిధులు ఉపాధికి కేటాయించాలి.5. అర్హులైన వారందరికీ సాగునీటి సౌకర్యంతో ఒక ఎకరా వ్యవసాయ భూమి ఇవ్వాలి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు కామారెడ్డి జిల్లా కన్వీనర్ బోలెశ్వర్ కో కన్వీనర్ అరవింద్, రాజు,గంగరాజు,మండల అధ్యక్షులు కవీన్, శివరామకృష్ణ, సత్యం, బాబు సాయికుమార్, రాజశేఖర్, నితిన్, సంజీవులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment