భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఎం ఆర్ ఓ కి వినతి పత్రం.

భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఎం ఆర్ ఓ కి వినతి పత్రం.

తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జనవరి

భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షులు కట్కమోజు ఉషాకిరణ్ ఆధ్వర్యంలో బిసి డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలని ఎమ్మార్వో కీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది.
ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ మాయ దశరథ మరియు ఓబీసీ జిల్లా అధ్యక్షులు దుర్గా పతి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీల్లో భాగంగా కామారెడ్డి బహిరంగ సభలో స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామని ,ప్రతి సంవత్సరం బడ్జెట్లో 20వేల కోట్లు కేటాయిస్తామని ఎన్నికలవేళ హామీలు ఇచ్చి తుంగలో తొక్కిందని రేవంత్ సర్కారు ఎన్నికల హామీలను వెంటనే అమలు చేయాలని కామారెడ్డి బిసి డిక్లరేషన్లు వెంటనే అమలుపరచుకుంటే బిజెపి ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో గ్రామస్థాయి నుండి ఉద్యమం చేపట్టి బీసీలకు న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చందా మహేందర్ గుప్తా, పదరాజు ఉమా శంకర్ రావు, నీలం రమేష్, ఆకుతోట రాము, పట్టణ అధ్యక్షులు రత్నాపురం బలరామ్, యువ మోర్చా జిల్లా అధ్యక్షులు పట్నం కపిల్, పట్టణ ప్రధాన కార్యదర్శి రాళ్లబండి కృష్ణచారి, యాట వెంకటేష్, గౌటీ రాజేష్, కుల్లోజు సతీష్, పెంట బోయిన నాగరాజు, ఎదగని సంతోష్, వంతు సన్నీ, దాసరి స్వామి, ఉషా కిరణ్, కొలిచెలిమా మల్లికార్జున్,గీస కొండల్, ఎర్రబెల్లి నాగరాజు, తుమ్మల నాగేష్, తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment