మండల వ్యవసాయ అధికారి వసంతరావు
తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి డిసెంబర్ 23,
సిద్దిపేట జిల్లా మర్కుక్ మండల వ్యవసాయ అధికారి వసంతరావు సోమవారం నాడు మర్కుక్ లో వివిధ రైతుల నారు మడులను సందర్శించారు.వారు మాట్లాడుతూ యాసంగిలో ముఖ్యంగా డిసెంబర్,జనవరి నెలలో అధిక చలి ఉండటం వలన వరి పంటలో అన్ని సమస్యలు తలెత్తుతాయని అన్నారు.ముఖ్యంగా నారు ఎండటం,చనిపోవడం,ఎదగకపోవడం,జింకు దాతులోపం,కాండంతో ఉధృతి,వంటి ప్రధాన సమస్యలు మనం గుర్తించవచ్చని అన్నారు.ఈ సమస్యలను అనుగమించడానికి సస్యరక్షణ చర్యలు పాటించాలని,చలికి తట్టుకునే వారి రకాలను ఎంపిక చేసుకోవాలని,JGL 24423,JGL18047,MTU 1010,RNR15048,KNM 733 రాత్రి వేళలో చలి ఉధృతి ఎక్కువగా ఉండటం వలన వరి నారుమడిపై పాలిథిన్ షీట్ లేదా టర్ఫలిన్లను,ప్లాస్టిక్ సంచులతో కుట్టిన పట్టాలను రాత్రి వేళలో కప్పి ఉంచి మరుసటి రోజు ఉదయాన్నే తీసివేయాలని తెలిపారు.రాత్రిపూట నారుమడిలో నీరు లేకుంటే చలి ప్రభావం మొక్కలపై తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రతిరోజు ఉదయం నీటిని పెట్టి సాయంత్రం తీసివేయాలని అన్నారు.రాత్రి ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తగ్గినప్పుడు పోషక లోపాలు ముఖ్యంగా జింకు లోపల లక్షణాలు కనిపిస్తుందని,దీని నివారణకు 1 లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ కలిపిన ద్రావణాన్ని పిచికారి చేయాలని అన్నారు.చలి తీవ్రత వల్ల నేల నుంచి పోషకాలు మొక్కలకు అందక నారుమడి ఎర్రగా మారుతుందని,దీని నివారణకు 19:19:19 పోషకాన్ని 10 గ్రాములు,2.5 గ్రాముల కార్బన్డిజం మ్యoకోజాబ్ జేబును ఒక లీటర్ నీటికి కలిపి 7 నుంచి 10 రోజుల రెండుసార్లు పిచికారి చేయాలని,యాసంగిలో కాండం తొలుచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి నారు దశ నుంచి తగు సస్యరక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు.నారు తీయడానికి వారం రోజుల ముందు రెండు గుంటల నారుమడికి 800 గ్రాముల కర్బోఫ్యురాన్ 3జీ గుళికలు వేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు విష్ణు వర్ధన్,రజనీకాంత్,మీనాక్షి,రైతులు తదితరులు పాల్గొన్నారు.