ఘనంగా స్తంభంపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి లా కళ్యాణ మహోత్స వం
తెలంగాణ కెరటం ధర్మపురి నియోజకవర్గ ప్రతినిధి ఫిబ్రవరి 09
జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం స్తంభంపల్లి గ్రామములో స్వయంభుగా వెలసిన శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి లా కళ్యాణం ఆదివారం మాఘశుద్ధ ద్వాదశి గోధూళి శుభ ముహూర్తమునా ఆలయ అర్చకులు అనంతస్వామి గోపాల స్వామి ఆధ్వర్యంలోని అర్చకుల బృందం ఘనంగా నిర్వహించారు ముందుగా స్వామి వారి ఉత్సవం మూర్తులను సేవపై ఆశీనులను గావించి గోవింద నామ స్మరణ మారుమ్రోగంగా గుట్టపైకి మేళతాళాలతో భక్త జన సందోహం మధ్య గోవింద నామ స్మరనలు మద్య వేడుకగా స్వామివారి అమ్మవార్ల ఉత్సవమూర్తులను గుట్టపైకి తీసుకువెళ్లి ప్రత్యేకంగా అందంగా అలంకరించిన కళ్యాణ వేదికలో స్వామివారి ఉత్సవ మూర్తులను ఆశీనులను గావించి అంగ రంగా వైభవం శ్రీదేవి భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అత్యంత వైభవ గా నిర్వహించారు ఆలయ చైర్మన్ చింతల రాజయ్య ఆధ్వర్యంలో స్వామి వారికి తలంబ్రాలు పట్టు వస్త్రాలు పుస్తెమట్టెలు తీసుకువచ్చారు ఆలయం చైర్మన్ చింతల రాజయ్య ఆధ్వర్యంలోని సభ్యులు భక్తులకు అన్ని సౌకర్యంలు కల్పించారు ఈ నెల 13న జరిగే రథోత్సవం కు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ఆలయ చైర్మన్ రాజయ్య తెలిపారు కళ్యాణ అనంతరం ఆలయ అర్చకులు గరుడ ముద్దలు ఎగురవేస్తారు ఈ ముద్దలు దొరికిన వారు ప్రసాదంగా తింటే సంతానం లేని వారికి సంతానం కలిగి శుభ ప్రదముగా ఉండునని భక్తుల విశ్వాసం ఈ కళ్యాణం మహోత్సవం కు ప్రభుత్వ. విప్ ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణం తిలకించారు ఆలయ అర్చకులు అనంతస్వామి ఆలయ చైర్మన్ చింతల రాజయ్య ఆధ్వర్యంలో సభ్యులు స్వామి వారి చిత్రపటం అందించి శ్యాలువలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో ధర్మపురి ఆలయ మాజీ చైర్మన్ మండల కాంగ్రెస్ నాయకులు సంగనభట్ల దినేష్ నాయకులు ఏఎంసి డైరెక్టర్ సప్ప లింగయ్య ఆలయ మాజీ చైర్మన్ నీలయ్య వెల్గటూర్ తాజా మాజీ సర్పంచ్ ఉప సర్పంచ్ మెరుగు మురళి గౌడ్ సందీప్ రెడ్డి నాయకులు ఏఎంసి మాజీ వైస్ చైర్మన్ పోడేటి రవి గౌడ్ మండల బి
ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్లూరి రామచంద్ర గౌడ్ పాదం దుబ్బ స్వామి గొంటి కిరిటి హరి ప్రశాంత్ చింతల కొమురయ్య చెంబర్తి కొమరయ్య పాకాల నరేష్ యాగండ్ల గంగయ్య నందగిరి రాజయ్య ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ యూత్ ప్రెసిడెంట్ అప్పం తిరుపతి వెలుగటూర్ మండల యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పూదరి రమేష్ ధర్మపురి తాజా మాజీ కౌన్సిలర్ గరిగె రమేష్ పాదం రవి స్తంభంపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ యూత్ అధ్యక్షులు గుర్రం మహేష్ నాయకులు శ్రీపాద సత్తయ్య ఈ కళ్యాణ మహోత్సవం కు వ చ్చు భక్తులకు స్థానిక ఎస్సై ఉమాసాగర్ ఆధ్వర్యంలోని పోలీసులు బందోబస్తు నిర్వహించారు గ్రామస్తులు భక్తులు పరిసర ప్రాంతం గ్రామస్తులు భక్తులు నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు