కోడి పందెలాస్తావరం పై పోలీసుల దాడి.
దొరికింది ఎంత వదిలింది ఎంత ❓,
తెలంగాణ కెరటం నారాయణపేట ప్రతినిధి
మక్తల్ సర్కిల్ పరిధిలోని రెండు మండలాల సరిహద్దులోని వాగులో కోడిపందాలు నిర్వహిస్తున్న స్తావరంపై ఆదివారం సాయంత్రం పోలీసులు దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది.
పోలీసులు దాడిలో దాదాపు 8 కోళ్లను ఇద్దరు వ్యక్తులని పట్టుకొన్నట్లు సమాచారం ఒక్కొక్క పందెంకోడి మూడు నుండి నాలుగు కిలోలు ఉంటుందని. వాటి విలువ 6వేల పైచిలుకు ఉంటుందని బాధితులు అంటూన్నారు. విశ్వాస నీయ సమాచార ప్రకారం రెండు మండలాల వాగు సరిహద్దు గ్రామంలోని ఆరుగ్రామాలకు చేందన దాదాపు 50 మంది వ్యక్తులు కోడిపందాలొ పాల్గొన్నారని గుర్తుతెలియని వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో దాదాపు నలుగురు పోలీసులు దూరంగా వారి వాహనాలను ఆపి స్తావరం దాడి చేసినట్లు తెలిసింది, మొదటగా వారు పంటలు వేసిన కంది పొలంలో ఉన్న వ్యక్తులను మాట్లాడి స్తున్నట్టు వ్యవహరిస్తూ హటాత్తుగా కోడిపందాలు ఆడుతున్న వ్యక్తుల మీద దాడి చేసినరు అని కోందరు పారిపోగా ముగ్గురు వ్యక్తులు దాదాపు ఎనిమిది కోళ్ళను పట్టుకున్నట్లు సమాచారం. అయితే వ్యక్తులను వదిలేసి కోళ్ళను నగదును తీసుకేళ్ళారని బాధితులు చేపుతున్నారు. మరి ఎంత మంది దొరికారు ఎంతమందిని వదిలేశారు అనేది తెలియాల్సి ఉంది,
దాడి చేసిన వారు స్పెషల్ టాస్క్ ఫోర్స్ సిబ్బందా పోలీసులా అన్నది తెలియాల్సి ఉంది.