నలుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
80000 రూపాయల నగదు స్వాధీనం
జగదేవపూర్ ఎస్ఐ చంద్రమోహన్
తెలంగాణ కెరటం గజ్వేల్ డివిజన్ ప్రతినిధి డిసెంబర్ 30,
సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలం జగదేవపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిగుల్ గ్రామ శివారులో కొంతమంది వ్యక్తులు కలసి పేకాట ఆడుతున్నారని నమ్మదగిన సమాచారంపై జగదేవపూర్ ఎస్ఐ చంద్రమోహన్ సిబ్బందితో కలసి రైడ్ చేశారు.04 వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి 80,000/- వేల రూపాయల నగదు,04 మొబైల్ ఫోన్లు,2 మోటార్ సైకిళ్ళు స్వాధీనం చేసుకున్నారు.జగదేవపూర్ ఎస్ఐ చంద్రమోహన్ కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.ఆడిన వారి పేర్లు గొర్లకాడి మల్లయ్య,సరదాగాని యాదగిరి,బచ్చలి భూపతి,బండమీది బీరయ్య,అందరి నివాసం తిగుల్,మండలం జగదేవపూర్ మండలo,సిద్దిపేట జిల్లా.జగదేవపూర్ ఎస్ఐ చంద్రమోహన్ మాట్లాడుతూ గ్రామాలలో ఫామ్ హౌస్ లలో,ఇళ్ళల్లో,పేకాట,బహిరంగ ప్రదేశంలో జూదం మరే ఇతర చట్టవ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే,లేదా ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నటు సమాచారం ఉంటే వెంటనే జగదేవపూర్ పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.