ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటిన పోలీసులు*

*ఆర్థిక సహాయం చేసి మానవత్వం చాటిన పోలీసులు*

 

* సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గం పరిధిలోని రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన పరంధాములు మరియు వెంకటేష్ కుటుంబాలకు ఆర్థిక చేయూత*

* గజ్వేల్ ఏసిపి, తొగుట సీఐ, తొగుట సర్కిల్ పోలీసులు ఇరు కుటుంబాలకు ఆర్థిక అందజేత*

 

తెలంగాణ కెరటం సిద్దిపేట జిల్లా క్రైమ్ ప్రతినిధి

రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుళ్లు పరంధాములు, వెంకటేష్ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేసి అండగా నిలిచి మానవత్వాన్ని చాటారు.సిద్దిపేట గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి ఆధ్వర్యంలో తొగుట సర్కిల్ పోలీస్ అధికారులు సిబ్బంది హోంగార్డ్స్ అందరూ కలిసి రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుళ్లు పరంధాములు, వెంకటేష్ కుటుంబ ఇరుకుటుంబ సభ్యులను పెద్ద కోడూర్, గాడిచర్లపల్లి గ్రామాలకు వెళ్లి పరమార్శించి వారి యొక్క కుటుంబ సభ్యులతో మాట్లాడి కుటుంబాలను ఓదార్చి డిపార్ట్మెంట్ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా కల్పించి తొగుట సర్కిల్ సిబ్బంది అధికారులు హోంగార్డ్స్ కలసి పరంధాములు కుటుంబ సభ్యులకు 1,50,000/- వేల రూపాయలు, వెంకటేష్ కుటుంబ సభ్యులకు 1,50,000/- రూపాయలు అందజేశారు.ఈ సందర్భంగా గజ్వేల్ ఏసిపి పురుషోత్తం రెడ్డి మాట్లాడుతూ కుటుంబ సభ్యులు మనోధైర్యాన్ని కోల్పోవద్దని డిపార్ట్మెంట్ అండగా ఉంటుందని భరోసా కల్పించారు, రావలసిన బెనిఫిట్స్ గురించి పోలీస్ కమిషనర్ మేడమ్ గారితో కలసి పరిస్థితి వివరించి త్వరగా రావడానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో తొగుట సిఐ లతీఫ్, దౌల్తాబాద్ ఎస్ఐ శ్రీరామ్ ప్రేమ్ దీప్, కుకునూరు పల్లి ఎస్ఐ శ్రీనివాస్, తొగుట ఎస్ఐ రవికాంత్ రావు, రాయపోల్ ఎస్ఐ రఘుపతి, బేగంపేట ఎఎస్ఐ అమృత్, రాయపోల్ ఏఎస్ఐ రాజు, మరియు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment