ఆకట్టుకున్న విద్యార్థులమాకు పోలింగ్.
ఎన్నికలను తలపించిన విద్యార్థుల ప్రదర్శన
సంబరపడిన విద్యార్థులు
తెలంగాణ కెరటం :రాయపోల్ ప్రతినిధి :జనవరి 10
రాయపోల్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులతో నిర్వహించిన మాక్ పోలింగ్ ఎంతగానో ఆకట్టుకుంది. ఎన్నికల వాతావరణం తలపించే విధంగా విద్యార్థులు ప్రదర్శించిన తీరును ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది. ఎన్నికల మాదిరిగానే విద్యార్థుల క్యూ లైన్ లో నిల్చోని ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం కౌంటింగ్ ఎన్నికల మాదిరిగానే నిర్వహించారు. పొడి చేసిన అభ్యర్థులకు వచ్చిన ఓట్లు కట్టలు కట్టి కౌంటింగ్ నిర్వహించారు. ఇందులో విజయం సాధించిన అభ్యర్థులను ప్రకటించారు. అనంతరం వారిచే ప్రమాణస్వీకారం చేయించి. నమూనాగ్రామసభను ఏర్పాటు చేయించి గ్రామ సభలో చర్చించాల్సిన అంశాలను విద్యార్థులకు అవగాహన కలిగే విధంగా ఉపాధ్యాయులు కృషి చేశారు. అధికార పక్షం ప్రతిపక్షం సవాల్ ప్రతి సవాల్ మాట్లాడుకుంటూ తోటి విద్యార్థులు శ్రద్ధగా వింటూ మాక్ పోలింగ్ పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం పండుగ వాతావరణం లో ఏర్పాటు చేయడంతో విద్యార్థులు ఎంతో సంబరపడ్డారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి సత్యనారాయణ రెడ్డి. పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజు. ఏఎస్ఐ దేవయ్య. ఏ ఏ పీ సి చైర్మన్ లావణ్య. సాంఘికశాస్త్ర ఉపాధ్యాయులు సావిత్రి. నర్సింగరావు. పాఠశాల ఉపాధ్యాయులు సిఆర్పిలు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు