జిట్టా బాలక్రిష్ణా రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ
తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జనవరి
ఈరోజు భువనగిరి పట్టణంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ లో ఈ నెల 12 న భువనగిరి పట్టణంలో తెలంగాణ మలిదశ ఉద్యమ నాయకులు,భువనగిరి ముద్దుబిడ్డ జిట్టా బాలక్రిష్ణా రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరించి,మీడియా సమావేశంలో మాట్లాడిన జిట్టాన్న విగ్రహ నిర్మాణ కమిటీ నాయకులు చీలుగురి సత్తి రెడ్డి,రత్నపురం శ్రీనివాస్,శీలం క్రాంతి రెడ్డి ,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వర్గీయ శ్రీ జిట్టా బాలకృష్ణ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా భువనగిరి నియోజకవర్గ ప్రజలు పాల్గొని వారికి ఘన నివాళులు అర్పించలని కోరారు.ఈ కార్యక్రమంలో దాసరి శ్రీనివాస్,దండెబోయిన నవీన్,దర్గాయి గణేష్,నర్సింహ,బరిగే శంకర్,అర్జున్ రెడ్డి,సతీష్, నీల భాను,రాజు యాదవ్, మందడి రాజు,చేగూరి వంశి,వేమన్ రెడ్డి,యాస సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు..