స్వచ్ఛభారత్ – స్వచ్ఛ తెలంగాణ – స్వచ్ఛ భువనగిరి కార్యక్రమంలో భాగంగా ముగ్గుల పోటీలు :పోతంశెట్టి వెంకటేశ్వర్లు 

స్వచ్ఛభారత్ – స్వచ్ఛ తెలంగాణ – స్వచ్ఛ భువనగిరి కార్యక్రమంలో భాగంగా ముగ్గుల పోటీలు :పోతంశెట్టి వెంకటేశ్వర్లు 

 

తెలంగాణ కెరటం యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (జనవరి 11):

 

గౌరవ పట్టణ మహిళా సోదరీమణులకు మరియు మహిళా సమ భావన సంఘాల సభ్యులకు తెలియజేయునది ఏమనగా, స్వచ్ఛభారత్ – స్వచ్ఛ తెలంగాణ – స్వచ్ఛ భువనగిరి కార్యక్రమంలో భాగంగా పట్టణ మహిళలకు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల యందు ఆదివారం తేదీ.12.01.2025 ఉదయం 9.00 గ.లకు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించబడును. ఇట్టి ముగ్గుల పోటీలు గెలుపొందిన వారికి

1.మొదటి బహుమతి రూ.5000/-,

2.రెండవ బహుమతి రూ.3000/-,

3.మూడవ బహుమతి రూ.2000/-,

4.10 మందికి కన్సోలేషన్ బహుమతులు రూ.1000/- లు

5.పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు కూడా బహుమతులు అందజేయబడును. కావున ఇట్టి కార్యక్రమానికి ఆహ్వానిస్తూ మహిళలందరూ ఇట్టి ముగ్గుల పోటీలలో పెద్ద సంఖ్యలో పాల్గొని ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని పోతంశెట్టి వెంకటేశ్వర్లు మున్సిపల్ చైర్మన్ భువనగిరి మరియు కమీషనర్ కోరారు.

Join WhatsApp

Join Now

Leave a Comment