బిఎస్పీ నాగర్ కర్నూల్ జిల్లా ఇంచార్జ్ గా పృథ్వీరాజ్ నియామకం.

బిఎస్పీ నాగర్ కర్నూల్ జిల్లా ఇంచార్జ్ గా పృథ్వీరాజ్ నియామ0

కం.

 

తెలంగాణ కెరటం నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి (జనవరి 15):

 

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బుధవారం జరిగిన బిఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి 69వ జన్మదిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బిఎస్పీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మంద ప్రభాకర్ , నాగర్ కర్నూల్ జిల్లా నూతన ఇంచార్జ్ గా మాజీ జిల్లా అధ్యక్షులు పృథ్వీరాజ్ ని నియమించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్ మాట్లాడుతూ బిఎస్పీ అధినేత్రి మాయావతి గారి ఆదేశాల మేరకు పార్టీలో యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎస్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అంతటి నాగన్న, జిల్లా ఇంచార్జ్ యోసేఫ్, జిల్లా అధ్యక్షులు రాంచందర్ అడ్వకేట్, అసెంబ్లీల ఇంచార్జ్లు కొత్తపల్లి కుమార్, కృపానందం, అసెంబ్లీల అధ్యక్షులు కళ్యాణ్, మల్లయ్య, బాలు, కురుమయ్య లతో పాటు బిఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా అధ్యక్షులు సాయిబాబా మరియు మండలాల అధ్యక్షులు, మండల, గ్రామ కమిటీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment