---Advertisement---

సీ.ఎం. క్రీడల కప్ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేసిన

---Advertisement---

సీ.ఎం. క్రీడల కప్ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేసిన

-అధికారులు కాంగ్రెస్ నాయకులు

తెలంగాణ కెరటం బాల్కొండ నియోజకవర్గం ప్రతినిధి డిసెంబర్ 11 :

నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండల కేంద్రంలో గల బాలుర ఉన్నత పాఠశాల ఆవరణ ముందుగల ప్రాంతంలో సీఎం కప్ క్రీడా పోటీలు, మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో, ఖోఖో, వాలీబాల్, కబడ్డీ,పలు క్రీడ పోటీలను,మంగళవారం, బుధవారంవిద్యార్థులకు క్రీడలు నిర్వహించారు. బుధవారం రోజు ముగింపు సందర్భముగా వాలీబాల్, ఖో ఖోక్రీడలలో మహాత్మ జ్యోతిరావు పూలే స్కూల్ విద్యార్థులు ప్రథమ బహుమతి, మండలంలోని శేట్ పల్లి,తిమ్మాపూర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని విద్యార్థులు ద్వితీయ బహుమతులు సాధించారు. కాగ రెండు రోజులపాటు నిర్వహించిన సీఎం కప్ క్రీడల ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మోర్తాడ్ మండల ఎంపీడీవో, సీఎం కప్ క్రీడల కన్వీనర్ తిరుమల, ఎంఈఓ సమ్మిరెడ్డి, కార్యదర్శి సైఫుద్దీన్, మోర్తాడ్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు జక్కం అశోక్, మోర్తాడ్ పట్టణ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుప్పల అశోక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి గిర్మాజీ గోపి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తక్కురి సతీష్ లు విజేతలైన విద్యార్థిని విద్యార్థులకుబహుమతులు ప్రధానం చేశారు. రెండు రోజులపాటు సీఎం కప్ క్రీడలు నిర్వహించిన ఎంఈఓ సమ్మి రెడ్డి, బాలికల ఉన్నత ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మోర్తాడ్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు,ఆయా గ్రామాల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ముఖ్యంగా క్రీడలు సక్రమంగా జరిగేలా కృషి చేసిన పి ఈ టి లకు, బహుమతి ప్రధానం గావించిన అధికారులు, కాంగ్రెస్ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment