ఇచ్చిన హామీలు నెరవేర్చాలి..

  • సేవాలాల్​ సేనా నాయకుల డిమాండ్​
  • సర్వశిక్ష అభియాన్​ ఉద్యోగులకు  సేవాలాల్​ సేనా మద్దతు


భద్రాద్రి జిల్లా ప్రతినిధి, జనవరి 05 (తెలంగాణ కెరటం): సర్వశిక్ష అభియాన్​ ఉద్యోగులకు సీఎం రేవంత్​ రెడ్డి ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని సేవాలాల్​ సేనా వ్యవస్థాపక అధ్యక్షుడు భూక్యా సంజీవ్​ నాయక్​ డిమాండ్​ చేశారు. భద్రాద్రి జిల్లా కలెక్టర్​ కార్యాలయం వద్ద ఉద్యోగులు నిర్వహిస్తున్న దీక్షలకు సేవాలాల్​ సేనా తరుపున ఆయన సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా సంజీవ్​ నాయక్​ మాట్లాడుతూ.. పీసీసీ హోదాలో రేవంత్​ రెడ్డి వారి సమస్యలను టీ తాగినంత సమయంలోనే పరిష్కరిస్తామని చెప్పారని.., ఇప్పడు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించి ఏడాది గడుస్తున్నప్పటికీ వారి సమస్యలు సీఎంకు పట్టడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. హామీ ఇచ్చినప్పుడు తెలియదా.. ఆ సమస్యలు పరిష్కరించాలని ప్రశ్నించారు. ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఉద్యోగుల తరుపున సేవాలాల్​ సేన పోరాడుతుందని అన్నారు. అనంతరం సేవాలాల్​ సేనా రాష్ట్ర కో కన్వీనర్​ బాణోత్ హుస్సేన్​ నాయక్​ మాట్లాడుతూ… సర్వశిక్ష అభియాన్​ ఉద్యోగుల సమస్యలు వర్ణనాతీతమని, వారి పోరాటంలో న్యాయం ఉందని అన్నారు. సీఎం రేవంత్​ రెడ్డి ఎందుకు వారి జీవితాలతో చెలగాటమాడుతున్నారని ఇప్పటికైనా స్పందించి వారికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సేవాలాల్​ సేనా కో కన్వీనర్​ లకావత్​ భాస్కర్​ నాయక్, సేవాలాల్​ సేనా ఉద్యోగుల సంక్షేమ శాఖ రాష్ట్ర నాయకులు బాలకృష్ణ, చౌహాన్​, బాబులాల్​ నాయక్​, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంట్రాక్ట్​ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment