---Advertisement---

రాజ్యాంగాన్ని రక్షించండి.. ప్రజాస్వామ్య పరిరక్షణ మా ధ్యేయం

---Advertisement---

ఇండియన్ మాల లాయర్స్ అసోసియేషన్
తెలంగాణ ఏక సభ్య కమిషన్ చైర్మన్ ఆధ్వర్యంలో డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ కు
ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వినతి పత్రం అందజేత

ఖమ్మం, డిసెంబర్ 12 (తెలంగాణ కెరటం): ఎస్సీ వర్గీకరణ పై అభిప్రాయాలు సేకరించేందుకు ఖమ్మం జిల్లా పర్యటనకు విచ్చేసిన తెలంగాణ ఏక సభ్య కమిషన్ చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్ ను  ఖమ్మం కలెక్టరేట్ లో ఇండియన్ మాల లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా వినతి పత్రం అందజేశారు. ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు ఆర్టికల్ 341 ప్రకారం రాజ్యాంగ విరుద్ధమని, కుల వివక్షత ఆధారంగా షెడ్యూల్డ్ కులాల్లోని 1227 కులాల జాబితాతో ఆధిపత్య కులాలతో సమానమైన అభివృద్ధిని సాధించేందుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా 15% రిజర్వేషన్లను కల్పించారని అన్నారు. ఈ రిజర్వేషన్లు ఎస్సీ లోని అన్ని కులాలు ప్రతిభ ఆధారంగా లబ్ధి పొందవలసి ఉన్నదని ఇప్పటివరకు ఈ రిజర్వేషన్లను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని వారు తెలిపారు. ఎస్సీ కులాల వెనుకబాటుకు కారణం ఆయా ప్రభుత్వాలే కారణమని అన్నారు. వెనుకబడిన ఆయా కులాల వారికి ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీల ద్వారా నిర్బంధ విద్య, వైద్యం, ఉపాధి పలు శిక్షణలతో కూడిన వసతి సదుపాయాలు కల్పించాలని కోరారు. ఎస్సీలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నదని, ఎస్సీ వర్గీకరణ పై రాష్ట్రాలకు ఎలాంటి అధికారం లేదని పార్లమెంట్ ద్వారా మాత్రమే 2/3 మెజారిటీతో బిల్లు రూపొందించి చట్టం చేయాల్సి ఉంటుందని వారు తెలిపారు. షెడ్యూల్ కులాలలో పెరిగిన జనాభాకు అనుగుణంగా ప్రస్తుతం ఉన్న 15% రిజర్వేషన్లను 25% కు పెంచాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నాయకులు విజ్ఞప్తి చేశారు. ఏజెన్సీలోని ఎస్సీలకు తమ ఆస్తులపై హక్కులు కల్పించాలని, అన్ని ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ వ్యక్తులకు కార్పోరేట్ కంపెనీలకు దారా దత్తం చేస్తూ పలు రాయితీలు ఇస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రైవేట్ రంగంలో ఎస్సీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుండి ప్రభుత్వ పథకాలలో ఎస్సీ కులాలు ఏ కులం ఎంత మేరకు లబ్ధి పొందిందో వివరాలతో కూడిన శ్వేతపత్రం ప్రభుత్వం విడుదల చేయాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. వివిధ కులాలకు కులవృత్తి ఆధారంగా పలు పథకాలు ప్రవేశపెడుతున్న ప్రభుత్వం ఎలాంటి కులవృత్తి లేని మాలలకు ప్రత్యేక పథకం ద్వారా లబ్ధి వారు పేర్కొన్నారు. ఎస్సీ లోని అన్ని కులాలు సమానమైన అభివృద్ధిని సాధించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి రాష్ట్ర కో కన్వీనర్ పల్లా రాజశేఖర్, ఇండియన్ మాల లాయర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రెంటాల ఆనంద్, ప్రధాన కార్యదర్శి మర్రి ప్రకాష్, ప్రచార కార్యదర్శి పిడతల రాం మూర్తి, ఈసీ సభ్యులు గోరింట్ల శాంతరావు, గుడిసె అనిల్ కుమార్, పంబా నాగేశ్వరావు, రెంటాల రత్నం, గుడిమల్ల రాజు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now
---Advertisement---

Leave a Comment