పేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
తెలంగాణ కెరటం, జనవరి 02, మందమర్రి
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం మందమర్రి 19వ వార్డు విద్యానగర్ కు చెందిన గోడిసేలరాజం బీద కుటుంబానికి చెందిన వ్యక్తి అనారోగ్య కారణాల వల్ల చనిపోవడం జరిగిందని వారి పరిస్థితి తెలుసుకున్న మందమరి కాంగ్రెస్ నాయకులు చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఆదేశాల ప్రకారంగా గోడిశెల రాజం కుటుంబానికి పదివేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే విద్యానగర్ ఎస్సీ ఎస్టీ కాలనీకి చెందిన మరో వ్యక్తి ఆవునూరి రాయమల్లు చనిపోయిన విషయం తెలుసుకున్న చెన్నూరు శాసనసభ్యులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఆదేశానుసారం 5000 రూపాయలు మందమర్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు కుటుంబానికి 5000 రూపాయలు ఇచ్చి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నోముల ఉపేందర్ గౌడ్ ఉమ్మడి జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి సోతుకు సుదర్శన్ పట్టణ నాయకులు మంకు రమేష్ ఎండి సుకూరు వేటూరి సత్యనారాయణ డాక్టర్ లింగన్న ఛీద్రాల సతీష్ రాజేశం తదితరులు పాల్గొన్నారు.