రోడ్డు ప్రమాదంలో గాయపడిన భవన నిర్మాణ కార్మికునికి ఆర్థిక సాయం అందజేత
తెలంగాణ కెరటం సూర్యాపేట జిల్లా ప్రతినిధి జనవరి
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండల పరిధిలోని గడ్డిపల్లి గ్రామానికి చెందిన భవన నిర్మాణ కార్మికుడు తురక చిన్న లింగయ్య రోడ్డు ప్రమాదము లో గాయపడిన కార్మికునికి ఆదర్శ భవన నిర్మాణ కార్మిక సంఘం ఐ ఎఫ్ టి సి అనుబంధ సంస్థ గడ్డిపల్లి గ్రామానికి చెందిన కార్మికులు సంఘం అధ్యక్షులు గుంజ నరసింహ రావు ఉపాధ్యక్షులు షేక్ హుస్సేన్ మరియు సభ్యులు తురక చిన్న లింగయ్య కుటుంబ సభ్యులకు పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేసినారు ఈ సందర్భంగా గుంజా నరసింహారావు మాట్లాడుతూ తురక చిన్న లింగయ్య సాయంత్రం పనులు ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణంలో ఒక్కసారి గేదెలు తగలడంతో కాలు విరిగినదని అతని కుటుంబం పోషణ కొరకు సభ్యుల సహకారంతో పదివేల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరిగిందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో బత్తుల సైదులు, తురక శ్రీను ,పిట్టల అంజయ్య, ఎర్ర మాద విద్యాసాగర్, తురక పెద్ద లింగయ్య, షేక్ లాలు, శేఖర్, గుంజ నరేష్ తదితరులు