ఎస్ ఎస్ ఏ ఉద్యోగులకు పి ఆర్ టి యు పాపన్నపేట మండల శాఖ ఆర్థిక చేయూత.
తెలంగాణ కెరటం
ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్ 28:
గత 19 రోజులుగా న్యాయమైన హక్కుల కోసం సమ్మె చేస్తున్న SSA ఉద్యోగులకు పి ఆర్ టి యు పాపన్నపేట మండల శాఖ సంఘీభావం తెలుపి వారికి మౌలిక అవసరాల నిమిత్తం *”18వేల రూపాయలు** ఆర్థిక సహకారం అందించింది .ఈ సందర్భంగా మండల అధ్యక్ష , ప్రధాన కార్యదర్శులు రాజు, సురేష్ మాట్లాడుతూ న్యాయమైన వారి డిమాండ్లు వెంటనే పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గత రెండు దశాబ్దాలుగా విద్యాశాఖలో భాగమై చాలీ చాలని వేతనంతో ఇన్నాళ్లు పని చేశారని పెరిగిన నిత్యవసర ధరలు దృష్టిలో ఉంచుకొని వారికి మినిమం టైం స్కేల్ వర్తింపచేయాలని,ఉన్నత పాఠశాలల్లో నుండి మహిళా ఉపాధ్యాయినిలకు KGBV లో SO లుగా నియామక ఉత్తర్వులు వెంటనే నిలిపివేయాలని మరియు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు వారిని రెగ్యులరైజ్ చేస్తూ సమ్మె విరమింపజేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పత్రికా సంపాదకులు వెంకటరామిరెడ్డి, కృష్ణమూర్తి , అంజనా చారి, భవాని ప్రసాద్, నర్సింలు,మహేష్ కుమార్ , సతీష్ గౌడ్, నింగప్ప, వెంకటరమణ, జనార్ధన్ ,విక్రాంత్, తాళ్ల శ్రీనివాస్, దేవయ్య, రాఘవేందర్ ,సిద్దేశ్వర్, పవన్ కుమార్, సిద్దిరా ములు, స్వామి, ప్రవీణ్ కుమార్, నాగేశ్వరరావు ,సంతోష్ కుమార్ ,అన పోతారెడ్డి ,సంపత్ కుమారి ,శ్యామల, సుబ్బమ్మ ,మధుసూదన్ ,మరియు పిఆర్టియు పాపన్నపేట మండల బాధ్యులు పాల్గొన్నారు.