ప్రజావాణి అర్జీలను సత్వరమే పరిష్కరించాలి.
అదనపు కలెక్టర్ నగేష్.
తెలంగాణ కెరటo ఉమ్మడి మెదక్ జిల్లా
ప్రధాన ప్రతినిధి డిసెంబర్
ప్రజావాణిలో వివిధ సమస్యలతో వచ్చే ప్రజల అర్జీలను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు.సోమవారం, జిల్లాలోని సమీకృత కలెక్టర్ కార్యాలయంలోని మెయిన్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో సంబంధిత అధికారులతో కలిసి అదనపు కలెక్టర్ ఫిర్యాదులను స్వీకరించి, పరిశీలించారు. ఈ సందర్భంగా (72) ఆర్జీలను అదనపు కలెక్టర్ స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులకు కేటాయిస్తూ, ప్రజా సమస్యలపై తగిన చర్యలు తీసుకొని, త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని అధికారులకు సూచించారు. ధరణి -18, పింఛన్లు-04, ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు-18, రుణమాఫీ 07-
ఇతర సమస్యలు 25 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు.